|
సింగిల్ కోసం పరుగెత్తాడు:
కరాచీ వేదికగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది. క్రీజులో వాండర్ దుస్సేన్, డీన్ ఎల్గర్ ఉన్నారు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ పాహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో బంతిని కవర్స్ దిశగా హిట్ చేసిన దుస్సేన్.. సింగిల్ కోసం పరుగెత్తాడు. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఎల్గర్.. పరుగు తీసేందుకు నిరాకరించాడు. అయితే అప్పటికే దుస్సేన్ పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. వెనుదిరిగే క్రమంలో దుస్సేన్ చేతిలో ఉన్న బ్యాట్ చేజారింది. దీంతో మరింత ఆలస్యం అయింది.

డైవ్ చేస్తూ వికెట్లని గీరాటేశాడు:
అప్పటికే బంతి కవర్స్ దిశగా నేరుగా ఫీల్డర్ బాబర్ అజామ్ చేతికి వెళ్లింది. వేగంగా బంతిని అందుకున్న అజామ్.. కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కి త్రో చేశాడు. అప్పటికే వికెట్ల సమీపానికి వచ్చిన రిజ్వాన్.. బంతిని అందుకుని డైవ్ చేస్తూ వికెట్లని గీరాటేశాడు. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు దుస్సేన్ డైవ్ చేసినా లాభం లేకపోయింది. రనౌట్ సమయానికి దుస్సేన్ క్రీజుకి చాలా దూరంలో ఉండటంతో.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఇంకేముంది దుస్సేన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. రిజ్వాన్ చేసిన రనౌట్‌కు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 'మహ్మద్ రిజ్వాన్.. జాంటీ రోడ్స్‌ని గుర్తుచేషావ్' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

220 పరుగులకే ఆలౌట్:
టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. మార్కరం (13), వాండర్ దుస్సేన్ (17), డుప్లెసిస్ (23), డికాక్ (15), బావుమా (17) నిరాశపరిచారు. పాక్ స్పిన్నర్ షా మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. అలీ (51) హాఫ్ సెంచరీ చేయగా.. ఆలం (109) సెంచరీ బాదాడు. అష్రాఫ్ (64), అలీ (6) క్రీజులో ఉన్నారు.
World Tour Finals: ప్చ్.. తొలి రౌండ్లోనే ఓడిన సింధు, శ్రీకాంత్!!