కీలక బ్యాటర్ అవుట్- పాకిస్తాన్ వెన్ను విరిగినట్టే..!!

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్ ఇవ్వాళ లైఫ్ అండ్ డెత్ గేమ్ మ్యాచ్ ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభమౌతుంది. ఈ టోర్నమెంట్‌లో ఇవ్వాళ జరిగే మ్యాచ్ ఇదొక్కటే.
ఈ మ్యాచ్ ఓడితే- దాదాపుగా టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ రేసు నుంచి అవుట్ అయినట్టే. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోబోతోండటం పాకిస్తాన్‌కు అగ్నిపరీక్షలా మారింది. దక్షిణాఫ్రికాకు కూడా ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనదే.

రెండు పాయింట్లతో..
గ్రూప్ 2లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది బాబర్ ఆజమ్ సేన. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో గెలిచింది ఒక్కదాంట్లోనే.. అది కూడా నెదర్లాండ్స్‌పై. కిందటి నెల 30వ తేదీన జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో నెగ్గడం వల్ల కొంతవరకు తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోగలిగింది. అంతకుముందు భారత్, జింబాబ్వే చేతుల్లో మట్టి కరిచింది. మూడు మ్యాచ్‌లు - రెండు పరాజయాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నది రెండు పాయింట్లే.

ఫకర్ అవుట్..
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫకర్ జమాన్ గాయపడ్డాడు. ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఫకర్ జమాన్ మోకాలికి పోస్టీరియర్ క్రూసియేట్ లిగమెంట్ సమస్య తలెత్తినట్లు పేర్కొంది. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడతను. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సమయానికి అతను కోలుకుంటాడని భావించినప్పటికీ.. సాధ్యం కాలేదు.

రిజర్వ్ ప్లేయరే అయినప్పటికీ..
ఫకర్ జమాన్ వందశాతం ఫిట్‌నెస్ సాధించడానికి కొంత సమయం పడుతుందని పాకిస్తాన్ టీమ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నజీబుల్లా సుమ్రో చెప్పారు. ఇదివరకే గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరం అయ్యాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022 ఫైనల్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. అనంతరం జట్టులోకి పునరాగమనం చేశాడు. టీ20 ప్రపంచకప్ కోసం అతన్ని రిజర్వ్ ప్లేయర్‌గా తీసుకుంది పీసీబీ.

మహ్మద్ హ్యారిస్‌తో
టీ20 ప్రపంచకప్ కోసం ఎంపికైన 15 మంది ప్లేయర్లల్లో ఒకడైన లెగ్ స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్ గాయం వల్ల టోర్నమెంట్ ఆరంభానికి ముందే తొప్పుకోవాల్సి రావడం వల్ల అతని స్థానాన్ని ఫకర్ జమాన్ భర్తీ చేశాడు. ఇప్పుడు అతను కూడా గాయపడ్డాడు. ఫకర్ స్థానాన్ని మహ్మద్ హ్యారిస్‌తో భర్తీ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. తదుపరి మ్యాచ్ నాటికి హ్యారిస్ జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications