Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shoaib Akhtar: లైవ్‌ షోలో అక్తర్‌కు ఘోర అవమానం.. మైక్‌ తీసి మరీ వెళ్లిపోయాడుగా! కారణం ఏంటంటే?

PAK vs NZ: Shoaib Akhtar walks out of talk show after being insulted by anchor Nauman Niaz

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌కు ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్‌ షోలో ఘోర అవమానం జరిగింది. పాక్ ప్రభుత్వ యాజమాన్య కనుసన్నల్లో నడుస్తున్న పీటీవీ స్పోర్ట్స్‌లో క్రికెట్‌ చర్చ జరుగుతుండగా.. సెట్ నుంచి వెళ్లిపోవాలని షో హోస్ట్ చెప్పాడు. ఊహించని పరిణామం ఎదురుకావడంతో అక్తర్ వెంటనే తాను ధరించిన మైక్రో ఫోన్‌ను పక్కన పెట్టేసి బయటికి వెళ్లిపోయాడు. అంతేకాదు ఆ ఛానెల్‌తో విశ్లేషకుడిగా ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఈ అవమానంతో క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగనని పాక్ మాజీ పేసర్ స్పష్టం చేశాడు. ఇక పీటీవీ షో నిర్వాహకుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజెన్లు మండిపడుతున్నారు.

మధ్యలో కలుగజేసుకున్న హోస్ట్:

విషయంలోకి వెళితే... టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా మంగళవారం (అక్టోబర్‌ 26) నాడు పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాక్‌ అద్భుత విజయం సాధించింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం పీటీవీ ఛానెల్‌ నిర్వహించిన లైవ్‌ షోకి రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ హాజరయ్యాడు. అతడితో పాటు సర్​ వివియన్​ రిచర్డ్స్​, డేవిడ్​ గోవర్​, రషీద్​ లతీఫ్​, ఉమర్ గుల్​, ఆకిబ్ జావేద్, పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ సనా మీర్ పాల్గొన్నారు. పాక్ బౌలర్లు హరీస్‌ రవూఫ్‌, షాహీన్‌ షా ఆఫ్రిదిపై అక్తర్‌ ప్రశంసలు కురిపిస్తుండగా.. ఆ టీవీ ఛానెల్ హోస్ట్‌ డాక్టర్‌ నౌమన్ నియాజ్‌ మధ్యలో కలుగజేసుకున్నాడు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దన్నాడు.

మైక్‌ తీసి మరీ వెళ్లిపోయాడు:

హోస్ట్‌ డాక్టర్‌ నౌమన్ నియాజ్‌ మాటలను పట్టించుకోని షోయబ్‌ అక్తర్‌ తన విశ్లేషణను కొనసాగించాడు. దీంతో నియాజ్‌కు కోపం వచ్చింది. షోయబ్‌తో తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని, దీన్ని సహించబోనని పేర్కొన్నాడు. షో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుండగానే.. అక్తర్‌ మారు మాట్లాడకుండా మైక్‌ తీసి టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. అయితే అక్తర్​ను తిరిగి పిలవడానికి గానీ, సముదాయించడానికి గానీ హోస్ట్​ నియాజ్ ప్రయత్నించలేదు. అక్తర్‌ వెళ్లిపోయిన తర్వాత షోను ఎప్పటిలాగానే కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

క్షమాపణలు చెప్పాలని డిమాండ్:

ఈ షోలో పాల్గొన్న సర్ వివియన్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, ఆకిబ్ జావేద్, సనా మీర్ వంటి ప్రముఖులు ఈ సంఘటనతో విచారం వ్యక్తం చేసినట్లుగా వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. షోయాబ్‌ అక్తర్‌కు మెజారిటీ నెటిజెన్లు సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచారు. దీనికి బాధ్యత వహించి డాక్టర్‌ నౌమాన్‌ నియాజ్ క్షమాపణలు చెప్పాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక తనతో చెడుగా ప్రవర్తించడం, సెట్‌ నుంచి వెళ్లిపోవాలని చెప్పడాన్ని అవమానంగా భావించి బయటకెళ్లిపోయానని షోయాబ్‌ అక్తర్‌ ట్వీట్‌ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోస్ట్​ నియాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Story first published: Wednesday, October 27, 2021, 22:26 [IST]
Other articles published on Oct 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+