Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుప్పకూలిన పాకిస్తాన్: న్యూజిలాండ్ భారీ విజయం

Ross Taylor
పల్లెకెలె: వరుస గెలుపులతో గ్రూప్ ఏలో ముందంజలో ఉన్న పాకిస్తాన్ మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ వన్డే మ్యాచ్‌‌లో ఘోర పరాజయం పాలైంది. ఓ ఓవర్‌లో అక్తర్ ఏకంగా 28 పరుగులు ఇవ్వడంతో న్యూజిలాండ్ మొదట 302 పరుగుల భారీ పరుగులు సాధించి పాకిస్తాన్ ముందు 303 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. చివరి నాలుగు ఓవర్ల సమయంలో టేలర్ క్రీజులో ఉన్నా అతడు ఫామ్‌లో లేడు గనుక స్కోరు 250 చేయడం గగనమనుకున్నారంతా. అక్తర్ బౌలింగ్‌లో తొలి బంతిని బౌండ్రీగా, తర్వాతి రెండు బంతులను భారీ సిక్సర్లుగా బా దాడు. ఇదే ఓవర్లో మరో ఫోర్, సిక్సర్ బాదాడు.

ఇవన్నీ చాలవన్నట్టు అక్త ర్ రెండు వైడ్లు బోనస్‌గా ఇవ్వడంతో ఈ ఓవర్లో మొత్తంగా 28 పరుగులు రాబట్టాడు టేలర్. అంతేకాదు పుట్టినరోజున సెంచరీ సైతం పూర్తిచేశాడు. ఇక బ్యాటింగ్ పవర్‌ప్లే ముగిసింది, బ్యాట్స్‌మెన్ దూకుడు తగ్గుతుందన్న పాక్ ఆశలు అడియాసలయ్యాయి. రెహ్మాన్ వేసిన 48వ ఓవర్లో మరోవైపునున్న జాకబ్ ఓరమ్ 25 ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టాడు. రజాక్‌కు 49వ ఓవర్ అప్పగించగా టేలర్ ఈ ఓవర్లో రెండు బౌండ్రీలు, మూడు సిక్సర్లతో చెలరేగడంతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇక చివరి ఓవర్లో పాక్ 19 పరుగులు సమర్పించుకోవడంతో చివరి నాలుగు ఓవర్లలో 92 పరుగులు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాబట్టగలిగారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాక్ టోర్నీలో తొలి పరాజయాన్ని చవిచూసింది. టేలర్ 124 బంతుల్లో 131 నాటౌట్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+