Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs NAM:బ్యాటింగ్ ఎంచుకున్న పాక్..రెండు మార్పులతో బరిలోకి న‌మీబియా!మరో విజయంపై కన్నేసిన బాబర్!

PAK vs NAM Playing 11 is Out: Namibia made two changes, Pakistan eye on 4th victory

అబుదాబి: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021 సూప‌ర్ 12 మ్యాచ్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో పాకిస్థాన్‌, న‌మీబియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బాబర్ విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించాడు. మరోవైపు న‌మీబియా మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. వరుస విజయాలతో దూకుడుమీదున్న పాక్.. మరో విజయంపై కన్నేసింది. ఇప్పటికే గ్రూప్-2లో మూడు విజయాలు అందుకున్న పాక్.. 6 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

పాకిస్థాన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో నమీబియాతో ఆడడం ఇది రెండోసారి మాత్రమే. 2003 ప్రపంచకప్‌లో ఓసారి తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ 171 పరుగులతో గెలిచింది. మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. అలానే లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో డిస్నీ+హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. భారత్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లను పాకిస్తాన్ ఓడించింది. వరుసగా మూడు విజయాలు సాధించిన పాకిస్తాన్ జట్టు లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మరోవైపు వరుస ఓటములతో నమీబియా సతమతమవుతోంది.

గ్రూప్ 2 పాకిస్థాన్ ఇప్ప‌టికే టాప్‌లో ఉంది. 3 మ్యాచ్‌లు గెలిచి పట్టికలో టాప్ పొజిష‌న్‌లో ఉంది. న‌మీబియా ఆడిన రెండు మ్యాచ్‌ల‌లో ఒక మ్యాచ్ మాత్ర‌మే గెలిచి.. నాలుగో స్థానంతో స‌రిపెట్టుకుంది. న‌మీబియాకు సెమీస్ బెర్త్ అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచినా కూడా నెట్ ర‌న్ రేట్ చాలా త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల సెమీస్‌లోకి వెళ్ల‌డం దాదాపు అసాధ్యం. పాకిస్థాన్ ఇప్ప‌టికే సెమీస్ బెర్త్‌ను క‌న్ఫ‌మ్ చేసుకుంది. మరోవైపు ఇదే గ్రూపులో ఉన్న భారత్ కూడా రెండు మ్యాచులు ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

తుది జట్లు:
పాకిస్థాన్: బాబ‌ర్ ఆజ‌మ్‌ (కెప్టెన్‌), మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్‌ (వికెట్ కీప‌ర్‌), ఫ‌క‌ర్ జ‌మాన్‌, మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్‌, సోయ‌బ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిమ్‌, హ‌స‌ల్ అలీ, హ‌రిశ్ ర‌వుఫ్, షాహీన్ షా అఫ్రిది.
న‌మీబియా: స్టీఫ‌న్ బార్డ్‌, మైకెల్ వాన్ లింగెన్‌, క్రేగ్ విలియ‌మ్స్‌, గెర్హార్డ్ ఎరాస్‌మ‌స్‌ (కెప్టెన్‌), డేవిడ్ వీయెసె, జేజే స్మిత్‌, జాన్ నికోల్ లాఫ్టీ ఈట‌న్‌, జేన్ గ్రీన్‌ (వికెట్ కీప‌ర్‌), జాన్ ఫ్రైలింక్‌, రుబెన్ ట్రంపెల్‌మాన్‌, బెన్ షికాంగో.

Story first published: Tuesday, November 2, 2021, 19:48 [IST]
Other articles published on Nov 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+