Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs ENG: జో రూట్ దెబ్బకు లారా-గవాస్కర్ రికార్డులు బ్రేక్.. ద్రవిడ్‌ను వదిలేలా లేడు!

టెస్టు ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బుధవారం ఏకంగా పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్ తరఫున ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పడంతో పాటు ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనతలు సాధించాడు. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్నతొలి టెస్టులో సెంచరీ బాది రూట్ రికార్డులు బ్రేక్ చేశాడు.

167 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్న జో రూట్‌‌కు టెస్టుల్లో ఇది 35వ సెంచరీ. ఇక ఈ ఏడాది‌లో అయిదో సెంచరీ. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆరో ప్లేయర్‌గా జో రూట్ చరిత్రకెక్కాడు. సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్ వంటి దిగ్గజ క్రికెటర్ల సెంచరీలను అధిగమించాడు. టెస్టుల్లో గవాస్కర్, లారా, యూనిస్ తలో 34 సెంచరీలు బాదారు.

PAK vs ENG Joe Root Surpasses Sunil Gavaskar s Test Century Record A New Milestone in Cricket History

ఇక ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్వెస్ కలిస్ (45), రికీ పాంటిగ్ (41), కుమార సంగక్కర (38), రాహుల్ ద్రవిడ్ (36) ఉన్నారు. జో రూట్ జోరు చూస్తే అతి త్వరలో ద్రవిడ్, సంగక్కర సెంచరీ రికార్డులు కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అయిదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు అత్యధికసార్లు సాధించిన ఆటగాడిగా కలిస్, స్టీవ్ స్మిత్‌తో కలిసి జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు.

తొలి స్థానంలో మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్ (4 సార్లు) ఉన్నారు. రూట్, కలిస్, స్మిత్ మూడు సార్లు 5+ సెంచరీలు నమోదు చేశారు. జో రూట్ 2021, 2022, 2024లో ఈ ఘనత అందుకున్నాడు. 2013 నుంచి 2020 వరకు 17 సెంచరీలే బాదిన రూట్ ఈ మూడేళ్లలో ఏకంగా 18 సెంచరీలు బాదడం విశేషం. కాగా, టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ రూట్ రికార్డు సాధించాడు. అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇంగ్లండ్ తరఫున కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 12472 పరుగులు చేశాడు. ఈ రికార్డును జో రూట్ 147 టెస్టుల్లోనే అందుకున్నాడు. రూట్ 50+ సగటుతో 12473+ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన అయిదో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

Story first published: Wednesday, October 9, 2024, 15:57 [IST]
Other articles published on Oct 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+