PAK vs ENG: జో రూట్ నయా చరిత్ర.. సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డు సమం!
టెస్టు ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్ 375 బంతుల్లో 262 పరుగులు చేశాడు. 17 ఫోర్లు బాదాడు. అయితే ఈ క్రమంలో పాకిస్థాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
పాకిస్థాన్‌పై అత్యధిక సార్లు 250+ స్కోరు సాధించిన ఆటగాడిగా సెహ్వాగ్ సరసన జో రూట్ నిలిచాడు. వీరిద్దరు పాక్‌పై రెండు సార్లు 250+ స్కోరు చేశారు. అంతేగాక జో రూట్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక సార్లు 250+ స్కోరు సాధించిన ప్లేయర్‌గా వాలీ హమ్మండ్, అలిస్టర్ కుక్‌లతో సమంగా నిలిచారు. వీళ్లంతా రెండు సార్లు ఈ ఘనత సాధించారు.

అలాగే ఆసియాలో భారత్, పాకిస్థాన్, శ్రీలంకపై డబుల్ సెంచరీ చేసిన పర్యాటక జట్టు ఏకైక బ్యాటర్‌గా జో రూట్ చరిత్ర సృష్టించాడు. కాగా, విదేశాల్లో రూట్‌కు ఇది నాలుగో ద్విశతకం. విదేశాల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్.. గ్రేమ్ స్మిత్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. రూట్, స్మిత్ విదేశాల్లో 4 సార్లు 200+ సాధించారు. ఇక అగ్రస్థానంలో డాన్ బ్రాడ్‌మన్, వాలీ హమ్మండ్, బ్రియాన్ లారా, కుమార సంగక్కర, యూనిస్ ఖాన్ ఉన్నారు. వీళ్లంతా విదేశీ గడ్డపై అయిదు సార్లు 200+ స్కోరు చేశారు.
కాగా, మరో బ్యాటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లకు 779 పరుగుల భారీ స్కోరు చేసింది. 310 బంతుల్లో బ్రూక్ 300 పరుగుల మార్క్ అందుకున్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 556 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications