Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైమ్ రికార్డు!

గత కొన్నాళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రూట్ రికార్డు నెలకొల్పాడు. అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.

ఇంగ్లండ్ తరఫున కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 12472 పరుగులు చేశాడు. ఈ రికార్డును జో రూట్ 147 టెస్టుల్లోనే అందుకున్నాడు. రూట్ 50+ సగటుతో 12473+ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో రూట్ మరో ఘనత అందుకున్నాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన అయిదో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

PAK vs ENG Joe Root Becomes England s All-Time Leading Run-Scorer in Tests Surpasses Alastair Cook

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (15,921) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (13,378), జాక్వెస్ కలిస్ (13,289), రాహుల్ ద్రవిడ్ (13,288), జో రూట్ (12473*) టాప్-5లో ఉన్నారు. టెస్టు ఫార్మాట్‌ల పరుగుల వరద పారించే జో రూట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌‌లో 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్థాన్‌కు దీటుగా ఇంగ్లండ్ బదులిస్తోంది. మూడో రోజు ఆట లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. జో రూట్ (72*), బెన్ డకెట్ (80*) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 96/1తో ఇవాళ ఆట ఆరంభించిన ఇంగ్లండ్ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించింది. అయితే ఆట ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ జాక్ క్రాలే (78) పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో వచ్చిన బెన్ డకెట్‌తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు అభేద్యమైన 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 556 పరుగుల భారీ స్కోరు సాధించిన సంంగతి తెలిసిందే. షాన్ మసూద్ (151), ఆఘా సల్మాన్‌ (104 నాటౌట్‌), షఫికి (102) సెంచరీలు సాధించారు. సౌద్ షకీల్ (82) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ మూడు వికెట్లు, గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, ఇంగ్లండ్ 324 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Wednesday, October 9, 2024, 13:07 [IST]
Other articles published on Oct 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+