రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఎదుర్కొన్న రెండో బంతికే డకౌటయ్యాడు. షోరిపుల్ ఇస్లామ్ వేసిన బంతిని లెగ్‌సైడ్ వైపు షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి చిక్కాడు. లిటన్ దాస్ కుడివైపునకు అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు.
అయితే డకౌట్ అయిన బాబర్ అజామ్ ఈ క్రమంలో కోరుకోని రికార్డు నమోదు చేశాడు. స్వదేశంలో టెస్టుల్లో బాబర్ డకౌటవ్వడం ఇదే తొలిసారి. మొత్తంగా అతని టెస్టు కెరీర్‌లో ఎనిమిదో సారి పరుగులేమి చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. 2021లో హరారేలో జింబాబ్వే చేతిలో డకౌటైన తర్వాత ఖాతా తెరవకుండా ఔటవ్వడం ఇదే ప్రథమం.

వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబార్ అజామ్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే టీ20 వరల్డ్ కప్-2024కు అజామ్‌కు మరోసారి సారథి బాధ్యతలు అందించారు. ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్ దారుణంగా విఫలమైంది. గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
29 ఏళ్ల బాబర్ అజామ్ 53 టెస్టులు, 117 వన్డేలు, 123 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 3898 పరుగులు, వన్డేల్లో 5729, టీ20ల్లో 4145 పరుగులు చేశాడు. ఇక పాకిస్థాన్-బంగ్లాదేశ్ టెస్టు విషయానికొస్తే..మొదటి రోజు ఆటకు వరుణుడు తీవ్రంగా ఆటంకం కలిగించడంతో 41 ఓవర్ల పాటు మాత్రమే ఆట కొనసాగింది. తొలి రోజు ఆట ముగిసేసమయానికి పాకిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా షఫికీ (2), షాన్ మసూద్ (6), బాబర్ అజామ్ (డకౌట్) నిరాశపరిచారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సౌద్ షకీల్ (57 నాటౌట్; 92 బంతుల్లో, 5 ఫోర్లు)తో కలిసి ఓపెనర్ సయీమ్ అయుబ్ (56; 98 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు అర్ధశతకాలు సాధించి నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు.