PAK vs AUS: లాహోర్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ చేసిన తప్పిదాలు, గందరగోళం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎక్కడ నుంచి అంపైర్లను పట్టుకొస్తుంది? ఒకే ఒక్క డీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడానికి థర్డ్ అంపైర్ తలప్రాణం తోకకు వచ్చింది. లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం వికెట్ విషయంలో అంపైర్లు చేసిన తప్పిదాలు చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
అసలేం జరిగిందంటే?
పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 2018 తర్వాత బాబర్ టాప్-3 స్థానాల బయట ఆడటం ఇదే తొలిసారి. అయితే స్థానం మారినా బాబర్ అదృష్టం మాత్రం మారలేదు. ఆడమ్ జంపా వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించిన బాబర్ ఆజం ఎల్బీడబ్ల్యూ (LBW) అయ్యాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రావిస్ హెడ్ రివ్యూ కోరాడు.

థర్డ్ అంపైర్ గందరగోళం
రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదని స్పష్టమైంది. బాల్ ట్రాకింగ్‌లో 'త్రీ రెడ్స్' వచ్చాయి. అంటే బాబర్ క్లియర్ అవుట్. కానీ ఇక్కడే అసలు కామెడీ మొదలైంది. బాబర్ రివర్స్ స్వీప్ ఆడుతున్నాడు కాబట్టి, ఆయన ఆఫ్-స్టంప్, లెగ్-స్టంప్ మారిపోయాయని థర్డ్ అంపైర్ భావించాడు. బంతి లెగ్ స్టంప్ బయట పడిందని పొరబడ్డాడు. కానీ నిబంధనల ప్రకారం బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడినా స్టంప్స్ మారవు. బాల్ ట్రాకింగ్ చూసిన తర్వాత కూడా థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ ఎహ్సాన్ రజాకు ఫోన్ చేసి, "ఒరిజినల్ డెసిషన్ (నాటౌట్)కే కట్టుబడి ఉండండి" అని చెప్పాడు.
స్టేడియంలో నవ్వుల పువ్వులు
అంపైర్ నాటౌట్ సిగ్నల్ ఇవ్వగానే.. డెసిషన్ రివర్స్ అయిందని, అది ఔట్ అని థర్డ్ అంపైర్‌కు ఎవరో గుర్తు చేశారు. వెంటనే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని ఫీల్డ్ అంపైర్‌ను 'ఔట్' ఇవ్వమని కోరాడు. ఈ గందరగోళం చూసి ఆస్ట్రేలియా ప్లేయర్లు, కామెంటేటర్లు పగలబడి నవ్వారు. బాబర్ ఆజంకు తాను ఔట్ అని ముందే అర్థం కావడంతో, బాల్ ట్రాకింగ్ చూసిన వెంటనే పెవిలియన్‌కు నడక సాగించాడు. పాక్ అంపైర్ల తీరుపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. "పాకిస్థాన్ అంపైర్లకు నిబంధనలు కూడా తెలియవా?" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.