భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో అభినందన్‌పై పాక్ టీవీ వ్యంగ్యంగా వీడియో

హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజ్ వేరు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఇరు దేశాలతో పాటు ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో భాగంగా ఇరు జట్లు జూన్ 16న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఓ యాడ్‌ను విడుదల చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ యాడ్‌లో వింగ్ కమాండర్ అభినందన్ సంఘటనను వ్యంగ్యంగా చూపుతూ రూపొందించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ దళాలను తప్పికొట్టే ప్రయత్నంలో భారత్ వైమానిక దళానికి చెందిన అభినందన్ పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో కిందపడిపోగా... అక్కడి స్థానికులు అతడిని పాక్ దళాలకు అప్పగించారు.

శత్రుచెరలో అభినందన్
శత్రుచెరలో ఉన్న సమయంలో తొలుత అభినందన్‌ను గాయపరిచినట్లున్న వీడియోలు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా పాక్ ఆర్మీ సిబ్బంది వింగ్ కమాండర్ అభినందన్‌కు సపర్యలు చేసినట్లుగా వీడియో తీశారు. ఎటుటవంటి భయం లేకుండా టీ తాగుతూ పాక్ అధికారుల ప్రశ్నలకు బదులిచ్చాడు.

దేశానికి గర్వకారణంగా
రెండు రోజులపాటు పాకిస్థాన్ చెరలో ఉన్న అభినందన్ ధైర్యసాహసాలను ప్రదర్శించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మార్చి 1న పాక్ ఆయనను భారత్‌కు తిరిగి అప్పగించిన విషయం తెలిసిందే. అభినందన్ టీ తాగుతున్న ఘటన ఆధారంగా పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఛానల్ ఓ యాడ్‌ను రూపొందించింది.
అచ్చం అభినందన్‌లాగే ఉన్న ఓ వ్యక్తి
అందులో అచ్చం అభినందన్‌లాగే ఉన్న ఓ వ్యక్తి టీమిండియా జెర్సీని ధరించాడు. టాస్ గెలిస్తే ఏం చేస్తారని ఆ వ్యక్తిని అడిగితే.. ఐయామ్ సారీ నేనేమీ చెప్పకూడదంటూ ఆ వ్యక్తి అంటాడు. ఇక చివరగా టీ కప్‌తో వెళ్తుంటే.. ఆ కప్పును ఎక్కడికి తీసుకు వెళ్తున్నావంటూ లాగేసుకుంటారు. ఇందుకు సంబంధించిన యాడ్ మీకోసం...
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications