
హైదరాబాద్: 2018లో జరగనున్న ఆసియా కప్ పురస్కరించుకొని బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సెక్రటీరీ అమితాబ్ చౌదరీ మంగళవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆసియా కప్ భవిష్యత్ ప్రణాళిక(ఎఫ్‌టీపీ)ని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ జట్టు ఆడుతుందో లేదోనని పాక్ క్రికెట్ బోర్డే నిర్ణయించుకోవాలని అన్నారు.
పాకిస్థాన్ ఆడుతుందా లేదా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన 2015 టీ 20లో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడింది. మరిప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో వాళ్లే నిర్ణయించుకోవాలి అని తేల్చి చెప్పారు.
2017 డిసెంబరు నెలలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ నజాం సేతి ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఆడాల్సిందేనంటూ హెచ్చరించాడు. ఇంకా, మేము ఆ కప్‌లో పాల్గొనాల్సిన క్రీడాకారులకు వీసా సమస్యలేవీ తలెత్త కూడదని కోరామని తెలిపాడు.
2014 ఒప్పందం ప్రకారం భారత్ పాకిస్థాన్‌తో ఆరు సిరీస్‌లలో ఆడాల్సి ఉంది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో ఉండగా రెండు భారత్‌లో జరగాల్సి ఉన్నాయి. కానీ, సెక్యూరిటీ సమస్య ఉందంటూ టీమిండియా పాకిస్థాన్‌తో ఆడేందుకు సుముఖుత చూపించట్లేదు. కాగా, భారత్ తమ దేశానికి వచ్చి ఆడితే తమ రెవెన్యూ మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ ఏడాది సెప్టెంబరు 15వ తేదీ నుంచి 30 వరకు ఆసియా కప్ 14వ ఎడిషన్ జరగనుంది. ఈ పోటీకి భారత్‌లో ఆడాల్సిందేనంటూ బీసీసీఐ సూచించింది. ఆడాలా వద్దా అనేది పాకిస్థాన్‌యే నిర్ణయించుకోవాలని బీసీసీఐ తేల్చి చెప్పింది.