Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాబర్‌ను పెళ్లి చేసుకుంటా.. పాక్ మాజీ లెజెండ్ కామెంట్స్ విని షాకైన ఫ్యాన్స్!

పాకిస్తాన్ నుంచి ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లే వస్తారు. కానీ అప్పుడప్పుడూ మంచి బ్యాటర్లు కూడా వచ్చి అందరినీ ఆకట్టుకుంటారు. గతంలో ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్ వంటి వాళ్లు అలాంటి బ్యాటర్లే. ఈ తరంలో ఆ పాత్రను బాబర్ ఆజమ్ పోషిస్తున్నాడు. ప్రపంచంలోని బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా పేరు సంపాదించాడీ పాక్ కెప్టెన్.

అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే మాదిరి పెరిగింది. ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో బాబర్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో కొలంబో స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్న బాబర్ కేవలం 59 బంతుల్లోనే 104 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు.

Babar Azam

ఈ ఫార్మాట్‌లో బాబర్‌కు ఇది పదో సెంచరీ కావడం గమనార్హం. ఇది చూసిన అందరూ బాబర్ బ్యాటింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఈ లీగ్‌లో కామెంటేటర్‌గా ఉన్న పాక్ మాజీ లెజెండ్, పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాబర్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఈ కామెంట్‌తో ఎవరికీ ఎలాంటి సమస్య రాలేదు.

అయితే ఆ వెంటనే రజా చేసిన కామెం్టస్ విన్న వాళ్లు షాకయ్యారు. 'నాకు బాబర్ అంటే చాలా ఇష్టం. తనను పెళ్లి చేసుకోవాలని ఉంది' అని రజా అన్నాడు. 'జాగ్రత్త, నాణ్యత, కామ్‌నెస్ అంతా కలిసి ఉన్న ఫిఫ్టీ. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆధార పడగలిగిన ప్లేయర్ అతను. నాకు అతనంటే చచ్చేంత ప్రేమ. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' అని చెప్పాడు.

Ramiz Raja

ఈ వింత కామెంట్ విన్న ఫ్యాన్స్‌కు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. తమ అభిమాన ప్లేయర్లను అందరూ తమకు తోచిన విధంగా మెచ్చుకోవడం పరిపాటే. కానీ ఇలా పెళ్లి చేసుకుంటానని అనడం మాత్రం ఫ్యాన్స్‌కు అర్థం కాలేదు. అయితే పీసీబీ తాత్కాలిక చైర్మన్‌గా రజా ఉన్నప్పుడు బాబర్‌తో కలిసి చాలా దగ్గరగా పనిచేసిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, August 8, 2023, 16:17 [IST]
Other articles published on Aug 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+