
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అయిన ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆడిన ఉమ్రాన్ మాలిక్.. ఇంటర్నేషనల్ కెరీర్లో తన తొలి వికెట్‌ను కూడా సాధించాడు. జమ్మూకు చెందిన యువ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఐపీఎల్ 2022లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. తన వేగవంతమైన పేస్‌తో బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 22వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అతని ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టుకు అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. తొలుత దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైనా.. అతను తుది జట్టులో మాత్రం ఆడలేదు. ఐర్లాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లోనే అతనికి అవకాశం లభించింది. ఇక ఉమ్రాన్ మాలిక్ గురించి పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా పలు అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో చివరి ఓవర్‌లో అతను విజయవంతంగా డిఫెండ్ చేయగలిగినప్పటికీ.. అతనికి ఇంకా చాలా టైం ఉందని డానిష్ కనేరియా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చినంత మాత్రాన అంత సులభంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో నిలదొక్కుకోలేమని, జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు అధిక ప్రెషర్ ఉంటుందని పేర్కొన్నాడు. 'ఉమ్రాన్ మాలిక్ చాలా వేగంగా బౌలింగ్ చేయగలడు. కానీ అతను ఇంకా చాలా ఆడాలి. అతను ఎక్కువ మ్యాచ్‌లు ఆడే కొద్దీ మెరుగుపడతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడిని తట్టుకోవడం అంత సులభం కాదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం ఆడటం వేరు.. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో ఆడడం వేరు. ఇంటర్నేషనల్ క్రికెట్లో పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఉంటాయి.. మీ ఆట మీద చాలా మంది ఓ కన్నేసి ఉంచుతారు' అని కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు.
అలాగే కనేరియా ఐర్లాండ్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌తో వారు ఫియర్ లెస్ బ్రాండ్ క్రికెట్ ఆడారని, తద్వారా తమ జట్టు కూడా పటిష్ఠమైనదేనని చాటిందని పేర్కొన్నాడు. రెండో టీ20లో ఛేదనలో 225పరుగుల భారీ స్కోరును ఛేదించే క్రమంలో దాదాపు దగ్గరిదాకా రావడాన్ని అభినందించాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ లాంటి నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొని ఆ రేంజులో హిట్టింగ్ చేయ