Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాపై నోరుపారేసుకున్న పాకిస్థాన్ ఆల్‌రౌండర్! (వీడియో)

దాయాది జట్లు భారత్, పాక్ దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరం కేవలం ఆట మాత్రమే కాదు.. అది కోట్ల మంది అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఓ మహా సంగ్రామం. ఇలాంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌ల గురించి ఏ చిన్న వివాదాస్పద కామెంట్ వచ్చినా అది క్షణాల్లో సంచలనంగా మారుతుంది. తాజాగా పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఖుష్‌దిల్ షా భారత్-పాక్ మ్యాచ్‌లపై చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్లు క్రికెట్ ప్రపంచంలో కొత్త చర్చకు తెరలేపాయి. భారత్‌తో జరిగే మ్యాచ్‌లలో అంపైరింగ్ నిర్ణయాలతో పాటు చాలా విషయాలు భారత జట్టుకే అనుకూలంగా వెళ్తాయంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశాడు.

ఓ పాడ్‌కాస్ట్‌లో తన తోటి ఆటగాడు అబ్బాస్ అఫ్రిదితో కలిసి మాట్లాడిన ఖుష్‌దిల్ షా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల సమయంలో ఉండే ఒత్తిడి, భావోద్వేగాల గురించి పంచుకున్నాడు. "భారత్‌తో మ్యాచ్ అంటే ఇరువైపులా ఎమోషన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. ప్రారంభంలో తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, మ్యాచ్ సాగుతున్న కొద్దీ అది తగ్గిపోతుంది. మా కాలంలో మేము కూడా భారత్‌ను ఓడించాము, మంచి పోటీ ఇచ్చాము" అని ఖుష్‌దిల్ పేర్కొన్నాడు.

Pak Cricketer Khushdil Shah Sparks Controversy Claims Umpires Favor India in IND vs PAK Matches

అయితే ఈ చర్చ సాగుతుండగానే ఖుష్‌దిల్ షా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఓ కామెంట్ చేశాడు. "భారత్‌తో మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో చాలా విషయాలు వారికే అనుకూలంగా మారుతాయి. అంపైరింగ్ నిర్ణయాలు కూడా భారత్‌కే ఫేవరెక్ట్‌గా వస్తాయి. అంతెందుకు, డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన కొన్ని నిర్ణయాలు, అలాగే మ్యాచ్‌ల నిర్వహణ సైతం వారి ఇష్టప్రకారమే జరుగుతున్నట్లు అనిపిస్తుంది" అని ఖుష్‌దిల్ షా ఆరోపించాడు. అయితే తన ఆరోపణలకు మద్దతుగా ఆయన ఎలాంటి నిర్దిష్ట ఉదాహరణలను లేదా మ్యాచ్ సంఘటనలను ప్రస్తావించలేదు. ఈ వివక్షలన్నింటినీ అధిగమించి పాకిస్థాన్ భారత్‌పై గెలిచినప్పుడు ఆ విజయాలు ఇచ్చే మజానే వేరని అన్నాడు.

ఈ పాక్ క్రికెటర్ కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌పై భారత్ సాధిస్తున్న వరుస విజయాల నిరాశతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని భారత అభిమానులు కొట్టిపారేస్తుండగా.. కొంతమంది పాక్ అభిమానులు మాత్రం ఖుష్‌దిల్‌కు మద్దతు తెలుపుతున్నారు. గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్థాన్‌పై తిరుగులేని రికార్డును కలిగి ఉంది. 2022 సెప్టెంబర్ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన వరుస 6 మ్యాచ్‌లలోనూ టీమిండియానే విజయం వరించింది. వన్డేల్లో సైతం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్థాన్ భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఖుష్‌దిల్ షా చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో మరింత దుమారం రేపుతున్నాయి.

Story first published: Sunday, June 7, 2026, 21:19 [IST]
Other articles published on Jun 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+