Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉగ్రదాడిలో పాత్ర లేకపోతే పాక్ ప్రధాని ఎందుకు స్పందించలేదు: పాక్ క్రికెటర్

Danish Kaneria: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత దేశవ్యాప్తంగా శోకసంద్రాలు అలుముకున్నాయి. పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాద దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత దేశంలోని చాలా మంది ప్రముఖులు, క్రికెటర్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెటర్ మాట్లాడారు. ఈ పహల్గాం ఉగ్రదాడిని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించారు. దీనితో పాటు ఆయన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

డానిష్ కనేరియా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో ఇలా రాసుకొచ్చారు. 'పహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్‌కు నిజంగా పాత్ర లేకపోతే ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంకా దానిపై ఎందుకు స్పందించలేదు? మీరు అకస్మాత్తుగా సైన్యాన్ని ఎందుకు అప్రమత్తంగా ఉంచారు? ఎందుకంటే నిజం ఏమిటో మీకు తెలుసు. మీరు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. మద్దతు ఇస్తున్నారు. మీరు సిగ్గుపడాలి.' అంటూ డానిష్ కనేరియా రాసుకొచ్చారు.

Pak Cricketer Danish Kaneria Slams Pakistan PM Over Silence on Pahalgam Terror Attack

బహిరంగంగా వ్యతిరేకించిన డానిష్ కనేరియా
డానిష్ కనేరియా పాకిస్థాన్ జట్టులో అత్యంత విజయవంతమైన స్పిన్ బౌలర్లలో ఒకరనే విషయం తెలిసిందే. అయితే జట్టులో మతం ఆధారంగా వివక్షత, ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా అతని కెరీర్ ముందుగానే ముగిసింది. ఈ క్రమంలో డానిష్ కనేరియా ఇప్పుడు పాకిస్థాన్ విడిచి వెళ్లాడు. అతను తన కుటుంబంతో సహా అమెరికాకు మకాం మార్చాడు. డానిష్ కనేరియా అనేక సందర్భాల్లో పాకిస్థాన్ క్రికెట్ ను, భారతదేశంపై పాక్ చేసిన పిరికి ఉగ్రవాద దాడులను బహిరంగంగా వ్యతిరేకించాడు.

పాకిస్థాన్ తరఫున డానిష్ కనేరియా క్రికెట్ కెరీర్ గురించి చెప్పాలంటే.. అతను 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్ లో డానిష్ కనేరియా 34.79 సగటుతో 261 వికెట్లు పడగొట్టాడు. ఒకానొక సమయంలో డానిష్ కనేరియా పాకిస్థాన్ నంబర్ వన్ స్పిన్ బౌలర్, కానీ జట్టు రాజకీయాల కారణంగా అతని కెరీర్ నాశనమైంది.

Story first published: Thursday, April 24, 2025, 10:38 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+