Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీలతో పాక్ ను ఆదుకున్న మిస్బా, అక్మల్


కోల్‌కతా: మిస్భా ఉల్ హక్, కెప్టన్ కమ్రాన్ అక్మల్‌ సెంచరీలతో కోల్‌కతా ఈడెన్‌గార్డెన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ పుంజుకుంది. టాప్ ఆర్డర్‌ను కోల్పోయిన దశలో డిలాపడిన పాకిస్థాన్‌కు మిస్భా, అక్మల్‌‌లు జట్టు కట్టి ప్రాణం పోశారు. దీంతో పాక్ భారీ పరుగుల దిశగా పయణిస్తోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. మిస్బా, అక్మల్ ల భాగస్వామ్యాన్ని భారత బౌలర్ హర్బజన్ సింగ్ విడదీశాడు. అక్మల్ 119 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి మిస్బా 108 పరుగులతో సమీ పరుగులేమీ చేయకుండా క్రీజ్ లో ఉన్నారు. మిస్పాకు ఇది తొలి టెస్టు సెంచరీ. అక్మల్, మిస్బా ఆరో వికెట్ కు 200కు పైగా పరుగులను జోడించారు.

అంతకుముందు వికెట్‌ నష్టానికి 50 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన పాక్ అతి తక్కువ పరుగులకే టాప్‌ఆర్డర్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 36 పరుగుల వద్ద యాసర్ హమీద్(21) ఔటయ్యాడు. కుంబ్లే బౌలింగ్‌లో యాసర్ హమీద్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మూడో రోజు ఆట ప్రారంభంలో జట్టుకు యూతమిస్తాడనుకున్న సల్మాన్ భట్ (42) హర్బజన్ విసిరిన బంతిని ద్రావిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అనంతరం రెండు ఓవర్లకే పటేల్ విసిరిన బంతితో ధోనీ కీపర్ క్యాచ్ ద్వారా యునెస్కాన్(43) ఔటయ్యాడు. అటు తర్వాత ఆరో వికెట్‌గా బ్యాటింగ్‌కు దిగిన మొహ్మద్ యూసుఫ్ 6 పరుగులకే చతికిలపడగా, కుంబ్లే విసిరిన బంతికి ఎల్పీడబ్ల్యూ ద్వారా ఇక్బాల్(0) నిష్క్రమించడంతో పాక్ కష్టాల్లో పడింది. కీలకమైన సమయంలో మిస్బా, అక్మల్ రాణించి పాక్ ను ఆదుకున్నారు.
Story first published: Sunday, December 2, 2007, 23:53 [IST]
Other articles published on Dec 2, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+