Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగుళూర్ టెస్టు: పాకిస్తాన్ 86/1


బెంగూళూర్: భారత్ తో జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో పాకిస్తాన్ రెండవ రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఓపెనర్ హమీద్ 48 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేసి కుంబ్లే బౌలింగులో అవుటయ్యాడు. ఆట ముగిసే సమయానికి మరో ఓపెనర్ సల్మాన్ భట్ 50 పరుగులతో, యూనిస్ ఖాన్ పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్సులో 626 పరుగులు చేసి ఆలవుటైంది. గంగూలీ, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్ ల బ్యాటింగు ప్రతిభతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. గంగూలీ డబుల్ సెంచరీ చేయగా మిగతా ఇద్దరు సెంచరీలు చేశారు. గంగూలీ యువరాజ్ తో కలిసి 300 పరుగులకు పైగా భాగస్యామ్యాన్ని నెలకొల్పగా, పఠాన్ తో కలిసి 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గంగూలీ అవుటైన తర్వాత బ్యాటింగుకు దిగిన భారత ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయారు.
Story first published: Sunday, December 9, 2007, 23:53 [IST]
Other articles published on Dec 9, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+