Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనాతో కూతుర్ని కూడా చూడలేకపోతున్నా.. షకీబుల్‌ హసన్‌ భావోద్వేగ పోస్ట్!!

Painful I cant see my daughter: Shakib Al Hasan in self-isolation after reaching US

హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 16 వేలు కావడంతో.. డబ్ల్యూహెచ్‌ఓ సూచించిన జాగ్రత్తలను అన్ని దేశాలు పాటిస్తున్నాయి. విదేశీ ప్రయాణం చేసి స్వదేశానికి వచ్చిన వారిని 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్‌ హసన్‌ కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్ళాడు. ఇటీవల అమెరికాకు వెళ్లడంతో అక్కడ ఓ హోటల్‌లో ఉంటూ స్వీయ నిర్బంధం విధించుకున్నా అని షకీబుల్‌ చెప్పాడు.

ప్రయాణంలో ఆందోళన చెందా

ప్రయాణంలో ఆందోళన చెందా

ఆదివారం తన ఫెస్‌బుక్‌లో ఓ వీడియో పంచుకున్న షకీబుల్‌.. కరోనాపై స్పందించాడు. తన కూతురు అలైనా హసన్‌ను చూడకపోవడం చాలా బాధగా ఉందని భావోద్వేగం చెందాడు. 'కొన్ని రోజుల క్రితం నేను అమెరికాకు వచ్చాను. విమానంలో ప్రయాణించేటప్పుడు వైరస్‌ కారణంగా ఆందోళన చెందా. అయితే ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా. అమెరికా చేరుకున్నాక నేరుగా హోటల్‌కు వెళ్లి స్వీయ నిర్బంధంలో ఉన్నా. ఇదే విషయాన్ని నా భార్య (ఉమ్మె అహ్మద్ షిషిర్), కూతురికి చెప్పాను' అని షకీబుల్‌ వీడియోలో పేర్కొన్నాడు.

 కూతుర్ని కూడా కలవలేకపోయా

కూతుర్ని కూడా కలవలేకపోయా

'నేను విమానంలో ప్రయాణించడంతో నాపై వైరస్‌ ప్రభావం ఉండొచ్చు. అందుకే స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నా. అమెరికాకి వచ్చాక నా కూతుర్ని కూడా కలవలేకపోయా. చాలా బాధగా ఉంది. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ త్యాగం ఎంతో అవసరం. విదేశాల్లో ఉండేవారు ఇళ్లలో ఉండటం ఎంతో ముఖ్యం. బయటకు రాకుండా ఉండండి. బంధువులు, చుట్టుపక్కల వారిని కూడా కలవకూడదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. కనీసం 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలి' అని మాజీ కెప్టెన్ సూచించాడు.

రెండేళ్ల నిషేధం

రెండేళ్ల నిషేధం

షకీబుల్‌ అక్టోబర్ 2019 నుండి క్రికెట్ ఆడలేదు. 2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్‌ తన తప్పులను ఒప్పుకున్నాడు. తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది.

Story first published: Tuesday, March 24, 2020, 16:08 [IST]
Other articles published on Mar 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+