
హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్‌కు భారత క్రికెట్‌జట్టు కోచ్ రవిశాస్త్రి ఓ సవాల్ చేశాడు. వారిద్దరినీ 'ప్యాడ్‌మ్యాన్' ఛాలెంజ్ చేసి చూపించాలంటూ విసిరాడు. ఇందుకు సంబంధించి ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టాడు.
'అవును! నా చేతిలో ప్యాడ్ ఉంది. నిషిద్ధాన్ని బద్దలు కొట్టి బహిరంగ చర్చకు రాక్‌స్టార్ అక్షయ్ కుమార్ నడుం బిగించినందుకు సంతోషంగా ఉంది. అక్షయ్ నోబాల్ ప్యాడ్ (మ్యాన్)ను తాకుతుందని నాకు కచ్చితంగా తెలుసు. నేనిప్పుడు విరాట్ కోహ్లీకి, లియాండర్‌పేస్‌కు ఈ సవాల్ విసురుతున్నా' అని రవిశాస్త్రి ట్వీట్ చేశారు.
అంతకు ముందు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇలాంటి వ్యాఖ్యతోనే శానిటరీ ప్యాడ్‌తో ఒక పోస్టు పెట్టింది. చాలా మంది ఈ ప్యాడ్‌మ్యాన్ సవాల్‌ను స్వీకరిస్తున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.'ప్యాడ్‌మ్యాన్'ను తమిళనాడు అరుణాచలంకు చెందిన మురుగనాథమ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
మురుగనాథమ్ ఓ సామాజిక ఉద్యమకారుడు. సమాజంలో మహిళలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే సమస్యను పరిష్కరించేందుకు శానిటరీ ప్యాడ్లు తయారుచేసి తక్కువ ధరకు లభించేలా కృషి చేశారు. రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కాబోతోంది.
మరోవైపు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన బుధవారం కేప్‌టౌన్‌లో జరిగే వన్డేలో గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలతో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.