Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌరవంగా భావిస్తున్నా: తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు

హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. 68వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం క్రీడా విభాగంలో కోహ్లీతో పాటు మరో ఏడుగురిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ నాలుగో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కావడం ఎంతో గౌరవంగా ఉందని అన్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులు, శ్రేయాభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇది కేవలం ఆటకు మాత్రమే సంబంధించింది కాదని, మొత్తం దేశానికి దక్కిన గౌరవమని చెప్పాడు.

Padma Shri award is 'appreciation by whole country', says Virat Kohli

ఎంతో సంతోషంగా ఈ అవార్డుని అందుకుంటానని అన్నాడు. తనకు అవార్డు దక్కడంపై కుటుంబ సభ్యులు, కోచ్‌, ఆప్తులు ఎంతో సంతోషించారని కోహ్లీ తెలిపాడు. 'ప్రతిష్ఠాత్మక అవార్డులు ప్రకటించడానికి రిపబ్లిక్‌ డే సరైనదని భావించి ఉండొచ్చు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన జాగృతమై ఉండాలి' అని కోహ్లీ అన్నాడు.

ఈ పురస్కారంతో కోహ్లీ కూడా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ధోని, హార్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ సరసన చేరాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ తొలి టీ20లోనే ఓటమి పాలయ్యాడు.

దీంతో కెప్టెన్ కోహ్లీ గత భారత టీ20 కెప్టెన్లెవరూ నెలకొల్పని రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన అనంతరం తొలి టీ20 మ్యాచ్ ను ఇంగ్లాండ్‌తో గురవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో తొలి టీ20 మ్యాచ్ లో ఓడిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

గతంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, అజింక్యా రహానేలకు సాధ్యం కాని ఈ రికార్డును కోహ్లీ సొంతం చేసుకోవడం విశేషం. ధోనీ తొలి టీ20 మ్యాచ్ లో ఫలితం తేలకపోవడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+