Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'భారత్‌కు ఎప్పుడంటే అప్పుడు బౌలింగ్ చేయగల ఫేసర్లున్నారు'

Pacers can win series for India: Ishant

హైదరాబాద్: కపిల్‌ దేవ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, జహీర్‌ ఖాన్‌ వంటి దిగ్గజ బౌలర్లు తమ తమ కాలంలో బంతితో భారత్‌కు ఒక్కొక్కరుగా సుదీర్ఘ కాలం సేవలందించారని టీమిండియా స్పీడ్‌స్టర్‌ ఇషాంత్‌ శర్మ తెలిపాడు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఎనిమిది, తొమ్మిది మంది పేస్‌ బౌలర్ల దళం భారత్‌కు ఉందని పేర్కొన్నాడు.

జో రూట్‌, జానీ బెయిర్‌స్టోకు సవాల్‌ విసరగలం

జో రూట్‌, జానీ బెయిర్‌స్టోకు సవాల్‌ విసరగలం

టీమిండియా తరఫున ఇప్పుడు ఇషాంత్‌ శర్మనే టెస్టుల్లో సీనియర్‌ బౌలర్‌. 82 టెస్టులు ఆడిన అతడు 238 వికెట్లు తీశాడు. అయితే తనతో పాటు ఉమేశ్‌ యాదవ్‌, మొహ్మద్‌ షమి ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జో రూట్‌, జానీ బెయిర్‌స్టోకు సవాల్‌ విసరగలరని ఇషాంత్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇషాంత్‌ పాత్ర కీలకం

2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇషాంత్‌ పాత్ర కీలకం

ఇంతకు ముందు 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇషాంత్‌ కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్‌లో గెలుపొందిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ‘ప్రస్తుతం ఇంగ్లాండ్‌ వాతావరణం చాలా బాగుంది. సుదీర్ఘంగా బౌలింగ్‌ చేయొచ్చు. పరిస్థితులు సహాయకారిగా ఉన్నాయి. వికెట్‌ అనుకూలంగా ఉంది. భారత, ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి'

 శిక్షణ అవసరం ఏమిటో తర్వాత తెలిసి:

శిక్షణ అవసరం ఏమిటో తర్వాత తెలిసి:

'గతంలో మ్యాచ్‌లు ముగియగానే ఇంటికి వెళ్లి సేద తీరేవాడిని. బంతి పట్టుకునే వాడిని కాదు. ఆ తర్వాత నాకు శిక్షణ అవసరం ఏమిటో తెలిసింది. మెల్లగా శిక్షణకు అలవాటు పడ్డాను. అంతకుముందు కేవలం వేగంగా మాత్రమే బంతులు విసిరేవాడిని. అనుభవం పెరిగే కొద్దీ పరిస్థితులు, వాతావరణం, ఒత్తిడి, బ్యాట్స్‌మెన్‌ ఎలా స్పందిస్తాడో అంచనా వేస్తూ బంతులు వేస్తున్నాను' అని ఇషాంత్‌ అన్నాడు.

శరీరంపై ఒత్తిడి ఆస్వాదించగలం:

శరీరంపై ఒత్తిడి ఆస్వాదించగలం:

‘భారత్‌ ఫాస్ట్‌ బౌలర్లను ఉత్పత్తి చేయలేదని అనడం అందరికీ అలవాటే. కానీ టీమిండియాకు ఎప్పుడంటే అప్పుడు బౌలింగ్‌ చేయగల పేస్‌బౌలర్లు ఇప్పుడు 8, 9 మంది ఉన్నారు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో గెలిచే సామర్థ్యం మాకుంది. ఎందుకంటే అలాంటి బౌలింగ్‌ దళం మా వద్ద ఉంది. అయితే ఫాస్ట్‌ బౌలింగ్‌ చేయడం అంత సులభం కాదు. శరీరంపై ఒత్తిడి ఉంటుంది. అయితే దీనిని ఆస్వాదించగలం. ఇది మన వ్యక్తిత్వాన్ని, సత్తాను పరీక్షిస్తుంది. ఒక పేస్‌బౌలర్‌గా ఉండటం నాకు సంతోషం' అని ఇషాంత్‌ అన్నాడు.

Story first published: Monday, July 23, 2018, 11:52 [IST]
Other articles published on Jul 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+