INDvsAUS: ఆ మ్యాచ్ తర్వాత నెలరోజులు ఏడుస్తూనే ఉన్నా.. ఎమోషనల్ అయిపోయిన వెటరన్ పేసర్!

టీమిండియా పేస్ బౌలర్ల గురించి మాట్లాడుకునేటప్పుడు కచ్చితంగా గుర్తొచ్చే పేర్లలో ఇషాంత్ శర్మ పేరు కూడా ఒకటి. అభిమానులంతా 'లంబూ' అని పిలుచుకునే ఈ వెటరన్ పేసర్ మంచి బౌలరే కానీ.. కొన్ని కీలక మ్యాచుల్లో ధారాళంగా పరుగులిచ్చి విమర్శలపాలయ్యాడు. ఇదే విషయాన్ని అతను తాజాగా ఒక కార్యక్రమంలో వెల్లడించాడు. అప్పుడెప్పుడో 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచును కూడా గుర్తు చేసుకున్నాడు.

నా జీవితంలో చీకటి రోజు..
ఆ మ్యాచ్ తన జీవితంలో ఒక చీకటి రోజు అని, దాని తర్వాత సుమారు నెల రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని ఇషాంత్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో ఛేజింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా చివరి మూడు ఓవర్లలో 44 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమీకరణం చూసిన వాళ్లందరూ విజయం దాదాపు భారత్‌దే అనుకున్నారు. కానీ ఇషాంత్ వేసిన 48వ ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు 30 పరుగులు చేసింది. దీంతో చివరి రెండు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. ఈ క్రమంలోనే భారత జట్టు ఈ మ్యాచ్ ఓడిపోయింది.

ఓటమికి కారణం నేనే..
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఇషాంత్ వేసిన 48వ ఓవర్లలో నాలుగు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ తర్వాత ఇషాంత్‌ను జట్టులో నుంచి తీసేశారు. 'నా జీవితంలో అత్యంత బాధాకరమైన సమయం అదే. ఆసీస్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో జట్టు ఓడిపోవడానికి నేనే కారణం.
ఆ విషయం తలచుకున్న ప్రతిసారీ దుఃఖం పెల్లుబికేది. అప్పట్లో నా భార్యతో నేను డేటింగ్‌లో ఉన్నా. తనతో ఈ విషయం మాట్లాడేవాడిని' అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమి తర్వాత చాలా మంది అభిమానులు, నిపుణులు కూడా ఇషాంత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పనికిరాడని తేల్చేశారు.

నెలరోజులు ఏడుస్తూనే..
'ఆ మ్యాచ్ తర్వాత దాదాపు నెలరోజులు నేను ఏడుస్తూనే ఉన్నా. నా భార్యకు ప్రతిరోజూ కాల్ చేసేవాడిని. నా వల్లే జట్టు ఓడిపోయిందని చెప్తూ ఏడ్చేసేవాడిని' అని ఇషాంత్ శర్మ గుర్తుచేసుకున్నాడు. అయితే అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఓపెనర్ శిఖర్ ధవన్ ఇద్దరూ కూడా మ్యాచ్ తర్వాత తనతో మాట్లాడారని ఇషాంత్ చెప్పాడు.
అంతకుముందు తను ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లను గుర్తుచేశారన్నాడు. అలా తనను ఓదార్చేందుకు వాళ్లిద్దరూ ప్రయత్నించారని తెలిపాడు. ఈ మ్యాచ్ తర్వాత ఇషాంత్ వన్డే కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది.

చివరగా ఎక్కడ ఆడాటంటే..
ఆ తర్వాత మళ్లీ ఫామ్ అందుకొని భారత్ తరఫున ఆడిన ఇషాంత్.. అదే ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన సిరీసులో పునరాగమనం చేశాడు. మొహాలీ మ్యాచ్ తర్వాత మొత్తం 12 మ్యాచులు ఆడిన తర్వాత అతన్ని వన్డే జట్టు నుంచి పూర్తిగా తొలగించేశారు.
ఇషాంత్ చివరగా 2016 జనవరి 23న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. ఇటీవలి కాలంలో ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, షమీ, బుమ్రా రాణిస్తుండటంతో టెస్టు జట్టులో కూడా ఇషాంత్ చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications