న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆర్చర్‌ సాధిస్తాడు.. అతను జట్టులో ఉండటం మా అదృష్టం'

Pacer Jofra Archer can help us regain Ashes in Australia says Ben Stokes

లండన్‌: నేను క్రికెట్‌ ఆడుతున్న సమయం నుంచి (మా కాలం) చూస్తున్నా.. పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వంటి నైపుణ్యం ఉన్న బౌలర్‌ను చూడలేదు. ఆర్చర్‌ మా జట్టులో ఉండటం మా అదృష్టం అని ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆర్చర్‌ తక్కువ మ్యాచులే ఆడాడు. ప్రపంచకప్‌లో ఆరంగేట్రం చేసిన ఆర్చర్.. అద్భుత ప్రదర్శన చేసి కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.

<strong>మానవతను చాటుకున్న గంభీర్.. మహిళ అభ్యర్థి ట్వీట్‌కు స్పందన!!</strong>మానవతను చాటుకున్న గంభీర్.. మహిళ అభ్యర్థి ట్వీట్‌కు స్పందన!!

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌:

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌:

ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లోని మొదటి టెస్టులో స్థానం దక్కలేదు. సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ గాయం కారణంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో చోటు దక్కించుకుని ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్నాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఆర్చర్‌ జట్టులో ఉండటం అదృష్టం:

ఆర్చర్‌ జట్టులో ఉండటం అదృష్టం:

యాషెస్‌ సిరీస్‌లో ఆర్చర్‌ 22 వికెట్లు సాధించి సిరీస్‌ సమం కావడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇదే విషయాన్ని బెన్‌ స్టోక్స్‌ కూడా ధ్రువీకరించాడు. స్టోక్స్‌ మాట్లాడుతూ... 'మా కాలంలో ఆర్చర్‌ వంటి నైపుణ్యం ఉన్న బౌలర్‌ను చూడలేదు. ఆర్చర్‌ మా జట్టులో ఉండటం మా అదృష్టం. 2021-22లో మేము తిరిగి యాషెస్‌ను పొందడంలో ఆర్చర్ సహాయం చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు' అని అన్నాడు.

 ప్రమాదకర బౌలర్:

ప్రమాదకర బౌలర్:

'బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడటం ఆర్చర్‌కు కలిసొచ్చింది. అక్కడి అనుభవాన్ని జాతీయ మ్యాచులలో కూడా చూపెడుతున్నాడు. అతని ప్రదర్శన అద్భుతం. నిలకడగా 90 మైళ్ల వేగంతో బంతులు వేయడం మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఎంతటి గొప్ప క్రికెటర్‌కైనా ఆర్చర్‌ ఒక ప్రమాదకర బౌలరే. తొలి టెస్టు కోల్పోయిన సమయంలో ఆర్చర్‌ రాక మరింత బలాన్ని ఇచ్చింది. మూడు, ఐదో టెస్టుల్లో గెలిచామంటే ఆర్చరే కారణం' అని స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 17, 2019, 14:25 [IST]
Other articles published on Sep 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X