జిమ్‌లో బుమ్రా కసరత్తులు.. కమింగ్ సూన్!!

ఢిల్లీ: అతి త్వరలోనే జట్టులోకి వస్తానని టీమిండియా స్టార్ పేసర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా ధీమా వ్యక్తం చేసాడు. వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌కు దూరమైన బుమ్రా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం బుమ్రా వెన్ను గాయానికి శస్త్ర చికిత్స అవసరమని భావించినా.. అది అవసరం కాలేదు. ప్రస్తుతం జిమ్‌లో కసరత్తులు చేస్తూ కష్టపడుతున్నాడు. జిమ్‌లో ఎక్స్‌ర్ సైజులు, ప్రతి రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

కమింగ్ సూన్:
జిమ్‌లో బుమ్రా కసరత్తులు చేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. టీమిండియా జట్టుతో త్వరలోనే జాయిన్ అవుతా అనే అర్ధం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చాడు. 'కమింగ్ సూన్' అంటూ తన ఫోటోకు క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. 'త్వరగా కోలుకో యార్కర్ కింగ్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'ఆల్ ది బెస్ట్' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

కివీస్‌తో సిరీస్‌కు బుమ్రా:
బుమ్రా కసరత్తులు చూస్తే.. న్యూజిలాండ్‌తో డిసెంబర్‌లో జరుగనున్న సిరీస్ నాటికి బుమ్రా గాడిలో పడే అవకాశం కనబడుతోంది. మరోవైపు టీమిండియా జట్టు యాజమాన్యం కూడా కివీస్‌తో సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక బుమ్రా కూడా భారత జట్టులోకి వస్తాననే ధీమాతో ఉన్నాడు.

అంబానీ విందుకు దూరం:
గాయం కారణంగానే వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరుగునున్న సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. గత కొన్ని రోజులుగా గాయం నుంచి కోలుకోవడంపైనే శ్రద్ధ పెట్టిన బుమ్రా.. ఎక్కడికి వెళ్లడం లేదు. దీపావళి పండగ సందర్భంగా ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ ఇచ్చిన విందుకు కూడా బుమ్రా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి జస్ప్రీత్ బుమ్రా కోలుకోవడంపైనే ఉంది.

బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం:
జస్ప్రిత్ బుమ్రా, స్మృతి మంధాన ప్రతిష్టాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాలకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. మొత్తం ఐదుగురికి ఈ పురస్కారం లభించగా.. అందులో ఇద్దరు భారతీయులు ఉండడం విశేషం. మిగతావారిలో ఫఖర్ జమాన్ (పాకిస్తాన్), దిముత్ కరుణరత్నే (శ్రీలంక), రషీద్ ఖాన్ (అప్ఘనిస్తాన్) లకు పురస్కారం వరించింది. విజ్డెన్ పురస్కారానికి ఎంపికైన మూడో భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications