భారత క్రికెటర్‌పై అమ్మాయితోపాటు ఐదుగురు దాడి, కారు ధ్వంసం
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో శుక్రవారం రాత్రి భారత క్రికెటర్ పర్వీందర్ అవానాపై దుండగులు దాడి చేశారు. ఓ అమ్మాయితోపాటు ఐదురుగు వ్యక్తులుఅవానాపై దాడికి పాల్పడి అతడి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.
వివరాల్లోకి వెళితే.. పర్వీందర్‌పై దాడికి పాల్పడిన ఐదుగురు అంతకుముందు ఓ ఐస్ ఫ్యాక్టరీ వద్ద కొంతమందితో గొడవపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓ కారు వారిని దాటుకుంటూ వెళ్లింది. అయితే ఆ కారు తమతో గొడవపడిన వారికి చెందినదిగా భావించిన యువకులు దాన్ని అడ్డుకుని కారులో ఉన్న పర్వీందర్‌పై దాడికి దిగారు.

అనంతరం అతని కారును ధ్వంసం చేసి అక్కడ నుంచి వారు పరారయ్యారు. వెంటనే పర్వీందర్ స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన వారు గ్రేటర్ నోయిడాలోని గంగోలా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
విచారణ కొనసాగుతోందని, నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు తెలిపారు. పర్వీందర్ భారత్ తరఫున 2012లో ఇంగ్లాండ్‌పై రెండు టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications