Umran Malik: జట్టులోకి పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్..

పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ టూర్ కు ఎంపికయ్యాడు. అతను టీ20, వన్డే రెండు జట్లలో చోటు సంపాదించాడు. కాగా న్యూజిలాండ్‌లో జరగబోయే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత నవంబర్ 18న వెల్లింగ్టన్‌లో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 25 నుంచి న్యూజిలాండ్‌లో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో భారత జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెండు సిరీస్‌లలో రిషబ్ పంత్ న్యూజిలాండ్‌లో జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
హైదరాబాద్ సన్ రైజర్స్
ఉమ్రాన్ మాలిక్ హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఐపీఎల్ లోకి అడుగు పెట్టి అందరిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అత్యధిక వేగంతో బంతులు వేయడం అతని ప్రత్యేకత. గతేడాది ఐపీఎల్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో రాణించాడు. దీంతో యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు ఉమ్రాన్ మాలిక్ ను నెట్ బౌలర్ గా తీసుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ జూన్ 26 2022న తన తొలి టీ20 మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడాడు.
2 వికెట్లు
చివరిగా జులై 10 ఇంగ్లాండ్ పై టీ20 మ్యాచ్ ఆడాడు. ఉమ్రాన్ మాలిక్ ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు అడగా.. 2 వికెట్లు తీసున్నాడు. 17 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన ఉమ్రాన్ మాలిక్ 24 వికెట్లు తీశాడు. ఇందులో ఒక్కసారి ఐదు వికెట్లు సాధించాడు. ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కావడంతో అతనికి తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications