న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌లో భాగంగా సెమీ పైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి అనంతరం టీమిండియా ఆటగాళ్లు తిరిగి వచ్చారు. విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మ చేతిలో చేయి వేసి కెమెరాలకు చిక్కారు.
ఈ టోర్నమెంటులో విరాట్ కోహ్లీ అందర్నీ అసంతృప్తికి గురి చేశాడు. కీలకమైన సెమీ ఫైనల్లో ఒక్క పరుగుకే అవుటై అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లోను విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఎంతో మాట్లాడాడు.
ఇప్పుడు చూస్తుంటే కోహ్లీ ఆత్మ విశ్వాసంతో మాట్లాడినట్లుగా కనిపించడం లేదని, అతివిశ్వాసంతో మాట్లాడినట్లుగా కనిపిస్తోందంటున్నారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సమయంలో తన ప్రియురాలు అనుష్క శర్మ ఆటను ప్రత్యక్షంగా వీక్షించడంతో.. కోహ్లీ విఫలం కావడానికి అనుష్కనే కారణమని నిప్పులు చెరిగారు.

ఈ టోర్నమెంటులో అందరు ఎక్కువగా ఆశ పెట్టుకుంది కోహ్లీ పైనే. అతనే ఎక్కువగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సమయంలో.. చెత్త షాట్ ఆడి అవుట్ కావడం అందర్నీ బాధించింది.
ఈ టోర్నమెంటులో కోహ్లీ ప్రదర్శన ఇలా...
లీగ్ దశ..
పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో కోహ్లీ 126 బంతుల్లో 107 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 60 బంతుల్లో 46 పరుగులు చేశాడు.
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 బంతుల్లో 3 పరుగులుచేశాడు.
సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు చేశాడు.