వరల్డ్‌కప్ 2019: టికెట్ల కొనుగోలుకు ముగిసిన గడువు, ఒక్కటీ మిగల్లేదు

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే నిర్వాహకులు సన్నాహాలు మొదలుపెట్టారు.
టోర్నమెంట్‌ని విజయవంతం చేసేందుకు గాను కొద్ది రోజుల క్రితం ఐసీసీ నిర్వాహకులు మ్యాచ్ టికెట్ల కోసం పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టికెట్లు కొనుగోలు చేసేందుకు అభిమానుల కోసం అందుబాటులో ఉంచిన ఈ పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్ ఆగస్టు 29 సాయంత్రం 5 గంటలతో ముగిసింది.

పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా టికెట్లు
ప్రపంచ వ్యాప్తంగా ఈ మెగా టోర్నీ చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా టికెట్ల ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. టికెట్ల కోసం ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో తాజాగా ఐసీసీ వెల్లడించింది. సుమారు రెండున్నర కోట్ల మంది అభిమానులు ఇందులో రిజిస్టర్ అయ్యారు.
ప్రారంభానికి ముందే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి
దీంతో టోర్నీ ప్రారంభానికి ముందే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. వరల్డ్ కప్‌లో అన్ని మ్యాచ్‌లకు అభిమానులు అప్లై చేసుకోవచ్చు. మ్యాచ్‌లపై పరిమితి అంటూ లేదు. బ్యాలెట్‌లో అభిమానులు ఎన్ని మ్యాచ్‌లకైనా టికెట్లను కోనుగోలు చేసే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. మొత్తం పది జట్లు పాల్గొనే ఈటోర్నీ వచ్చే ఏడాది మే 30న ప్రారంభం కానుంది.
రౌండ్ రాబిన్ విధానంలో వరల్డ్ కప్
టోర్నీలో భాగంగా మే 30, 2019న ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ విధానంలో జరగనుంది. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది.

టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్‌కి
ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు. టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్‌కి వెళ్తాయి. రెండు సెమీఫైనల్స్‌లో విజేతగా నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications