
హైదరాబాద్: గల్లీ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)నే తికమక పెట్టే ప్రశ్న అడిగారు. పాకిస్థాన్‌లో జరిగిన ఓ గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బంతి వికెట్‌ను గిరాటేసింది... కానీ, అనూహ్యంగా బెయిల్స్ మాత్రం కిందపడలేదు. దీంతో ఔటో, నాటౌటో అన్న సందేహం అందరికీ వచ్చింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అక్కడున్న గల్లీ అంపైర్‌కు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. దీంతో వాళ్లు విషయాన్ని తేల్చుకుందామని ఈ ఫొటోను నేరుగా ఐసీసీకి ట్వీట్ చేశారు. మీరే న్యాయం చెప్పాలంటూ అడిగారు. దీంతో మొదట ఈ ప్రశ్నకు జవాబును చెప్పాల్సిందిగా క్రికెట్ అభిమానులను ఐసీసీ కోరింది.
దీంతో కొంతమంది అభిమానులు నాటౌట్ అనే ఐసీసీకి సమాధానమిచ్చారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం బెయిల్స్ కింద పడాలి కదా. మిడిల్ స్టంప్ కింద పడినా.. పైనున్న బెయిల్ చెక్కు చెదరలేదు కాబట్టి.. ఇది నాటౌటే అని తేల్చారు. ఆ తర్వాత ఐసీసీ తన చట్ట ప్రకారం బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌గా తేల్చింది.
ఐసీసీ రూల్ బుక్‌లోని 29.1.1 ప్రకారం ఇది ఔట్. ఎందుకంటే ఈ నిబంధన ప్రకారం బెయిల్ కింద పడాలి లేదా స్టంప్ పూర్తిగా నేలకొరగాలి. అలా జరిగితే బ్యాట్స్‌మన్ ఔటే. దీంతో బ్యాటర్ ఔటయినట్టేనని తేల్చి చెప్పడం విశేషం.