
హైదరాబాద్: బుధవారం తామిచ్చే రిసెప్షన్‌కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గరకు కొత్త పెళ్లి జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతీ తెలిసిందే.
తాజాగా ఈ ఫోటోలకు నెటిజన్లు కాస్త తమ క్రియేటివిటీని జోడించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఫొటోలకూ, మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రావడానికి లింకు పెడుతూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. 99 మీద ఔటైతే ఎలా.. సెంచరీలు ఇలా చేయండి అని మోడీకి కోహ్లికి సలహాలు ఇచ్చినట్లుగా ట్వీట్స్ పోస్టు చేశారు.