యువీని.. ఐపీఎల్ వదిలేసింది.. రంజీ ట్రోఫీనే ఆధారమైంది!!


హైదరాబాద్: తనెంటో నిరూపించుకుని ఐపీఎల్ 2019వేలంలో చోటు దక్కించుకోవాలని భారత వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గట్టి ప్రణాళికలో ఉన్నాడు. ఈ క్రమంలోనే దేశవాళీ క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. ఏడాదిన్నర కాలంగా టీమిండియాకి దూరమైన యువీ.. ఐపీఎల్ 2018 సీజన్‌లో నిరాశపరచడంతో కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ అతడ్ని వేలంలోకి విడిచిపెడుతున్నట్లు ఇటీవలే నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో.. యువరాజ్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు.

కెరీర్ గురించి పునరాలోచనలో
ఫామ్, ఫిట్‌నెస్ లేమితో ఈ ఏడాది సీజన్‌లో ఒక్క దానిలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన యువీని 2019 ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబరులో జరగనున్న వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవచ్చనే అనుమానాలు లేకపోలేదు. దీంతో.. ఈ ఆల్‌రౌండర్ కూడా కెరీర్ గురించి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడేందుకు పూనుకున్నాడు.

బుధవారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌తో
ఇప్పటికే పంజాబ్ ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో 2 మ్యాచ్‌లు ఆడింది. వాటికి అందుబాటులో లేని యువరాజ్ సింగ్.. బుధవారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌తో జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఢిల్లీ.. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు జట్లతో తలపడనున్న పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

వేలంలో ఫ్రాంఛైజీలు దృష్టిలో పడేందుకు
ఈ ఏడాది ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్ పేలవంగా 264 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో.. దేవధర్ ట్రోఫీలో అతనికి సెలక్టర్లు చోటివ్వలేదు. దీనికి తోడు.. ఇప్పుడు ఐపీఎల్ జట్టు కూడా విడిచిపెట్టడంతో.. ఫామ్ నిరూపించుకుని డిసెంబరులో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఫ్రాంఛైజీలు దృష్టిలో పడేందుకు ఈ వెటరన్ ఈ ఆల్‌రౌండర్ సిద్ధమైయ్యాడు.

3 మ్యాచ్‌లపైనే యువరాజ్ భవితవ్యం
ఈ మూడు మ్యాచ్‌లు మళ్లీ యువరాజ్‌కు క్రేజ్‌ను పెంచుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. నవంబరు 28 నుంచి ఢిల్లీతో ఆడి డిసెంబరు 6, 14తేదీలలో మిగిలిన మ్యాచ్‌లలోనూ యువరాజ్ పుంజుకోవాలని ఆశిద్దాం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications