కోహ్లీ రికార్డు: ఆలోచనలన్నీ 'బిగ్ సిరిస్' పైనే (ఫోటోలు)
హైదరాబాద్: తనతో పాటు జట్టు సభ్యుల దృష్టంతా ఆస్ట్రేలియాతో జరగబోయే 'బిగ్ సిరిస్' పైనే ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 208 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌పై కోహ్లీ స్పందించాడు. 'ఇదో బిగ్ సిరిస్. ఈ సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరిస్‌లో 4-0తో విజయం సాధించాం. అదే జోరుని ఆస్ట్రేలియాపై కూడా కొనసాగించాలి. జట్టులోని ప్రతి ఒక్కరూ మైండ్, ఆలోచనలు దానిపైనే ఉన్నాయి' అని కోహ్లీ చెప్పాడు.

బంగ్లాటెస్టులో కోహ్లీ రికార్డు
కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఈ టెస్టు విజయంతో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ రికార్డుని బ్రేక్ చేసి టీమిండియాకు అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

టెస్టుల్లో 15 కోహ్లీ 15వ విజయం
కెప్టెన్‌గా కోహ్లీకి బంగ్లాపై విజయం 15వ విజయం కావడం విశేషం. అంతేకాదు కోహ్లీ కెప్టెన్సీలో సొంతగడ్డపై టీమిండియాకు ఇది నాలుగో సిరిస్ విజయం కావడం విశేషం. మొత్తంగా చూస్తే వరుసగా ఆరో సిరిస్ విజయం కావడం విశేషం.

వరుసగా ఆరో టెస్టు సిరిస్
ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన కోహ్లీ వరుసగా శ్రీలంకపై 2-1, దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టిండీస్‌పై 2-0, న్యూజిలాండ్‌పై 3-0, ఇంగ్లండ్‌పై 4-0 తేడాతో సిరీస్‌లు చేజిక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌మ్యాచ్‌లోనూ గెలుపొంది వరుసగా ఆరో టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 240 బంతుల్లో కోహ్లీ 204 పరుగుల చేశాడు. ఇందులో 24 ఫోర్లున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications