Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'భారత్‌పై గెలవడం కష్టమే, ఇది మాకు క్లిష్టమైన సిరీస్'

 Our chances against India are slim - Muralitharan

హైదరాబాద్: ప్రస్తుతం భారత పర్యటనలో శ్రీలంక జట్టుకు విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ జట్టు మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ 'లంకతో గత రెండు సిరీస్‌ల్లోనూ భారత్‌దే విజయం. రెండు నెలల కిందటి సిరీస్‌తో పోలిస్తే ఇప్పుడు శ్రీలంక జట్టులో ఆటతీరు పరంగా గొప్ప మార్పేమీ లేదు. కానీ శ్రీలంక ఆటగాళ్లు కొంచెం పట్టుదల, పోరాట పటిమ ప్రదర్శిస్తే భారత్‌కు ప్రతిఘటన ఎదురు కావచ్చు' అని అన్నాడు.

'మా జట్టుకు భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌ను గెలిచే అవకాశాలు చాలా తక్కువే. భారత్‌తో పోటీపడటానికి ప్రతి జట్టు చాలా కష్టపడుతుంది. గత 13 ఏళ్లుగా చూస్తే భారత్‌లో సిరీస్ గెలిచినవి రెండే జట్లు. ప్రస్తుతం టీమిండియా నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉంది. మా టెస్టు క్రికెట్ ప్రస్తుతం బాగానే ఉంది. కానీ పొట్టి ఫార్మాట్లలోనే మేం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇది మాకు క్లిష్టమైన సిరీస్. మా ఆటగాళ్లు తామేంటో నిరూపించుకోవడానికి మంచి అవకాశం' అని మురళీధరన్ చెప్పుకొచ్చాడు.

'నేను ఆడినప్పుడు భారత్‌కు ప్రపంచ అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉండేది. ఇప్పటితో పోలిస్తే అప్పుడు భారత్ బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. సెహ్వాగ్, గంభీర్, ద్రవిడ్, టెండూల్కర్, గంగూలీ, లక్ష్మణ్, ధోనీ.. ఇలా ఓపెనర్ నుంచి ఏడో స్థానం వరకు పెద్ద బ్యాటింగ్ లైనప్. కాబట్టి వారిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండేది' అని ముత్తయ్య పేర్కొన్నాడు.

'నిజానికి ఇరు జట్ల స్వదేశంలో చాలా పటిష్టంగా ఉంటాయి. అలా ఉండబట్టే, 22 ఏళ్లుగా శ్రీలంకలో టీమిండియా టెస్టు సిరిస్ విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలమైంది. భారత జట్టుని ధీటుగా ఎదుర్కొన్నాం అని చెప్పేందుకు కొన్ని తీపిగుర్తులు ఉన్నాయి. 1997లో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టులు జరిగాయి. రెండు స్వదేశంలో, మూడు బయట. ఈ ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. అప్పట్లో ఇరు జట్లలో అద్భుతమైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు' అని ముత్తయ్య చెప్పుకొచ్చాడు.

ముత్తయ్య మురళీధరన్ 2010లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 1994 నుంచి 2009 వరకు భారత్‌తో శ్రీలంక ఆడిన నాలుగు సిరీస్‌లకు మురళీధరన్ ప్రాతినిథ్యం వహించాడు. కానీ శ్రీలంక ఒక్క టెస్టు సిరిస్‌ను కూడా గెలవలేకపోవడం విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 15, 2017, 18:39 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+