వన్డే సిరిస్‌నూ కూడా టీమిండియా కొల్పోనుందా..?

ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టును దురదృష్టం వెన్నాడుతూనే ఉంది. సౌతాంప్టన్‌లో వర్షం వల్ల మంగళవారం రాత్రి కుదించిన రెండవ వన్ డే అంతర్జాతీయ (ఒడిఐ) మ్యాచ్‌లో క్షతగాత్ర బాధిత భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఆతిథేయ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. 50 ఓవర్ల ఒడిఐని 23 ఓవర్ల ఒడిఐగా కుదించగా విజయం కోసం కావలసిన 188 పరుగులను ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలస్టెయిర్ కుక్ అజేయ 80 పరుగుల స్కోర్ పుణ్యమా అని మూడు వికెట్ల నష్టానికి సాధించింది. కుక్ 63 బంతులు మాత్రమే ఎదుర్కొని 80 పరుగులు చేయగా ఇంగ్లండ్ జట్టు ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగా గెలుపు లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే, ఇంగ్లండ్ లక్ష్య ఛేదనకు మెరుపు వేగంతో నాంది పలికినవాడు క్రెయిగ్ కైస్‌వెటర్. అతను కేవలం 25 బంతులు ఎదుర్కొని 46 పరుగులు సాధించాడు. అతని స్కోర్‌లో నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇయాన్ బెల్ (16 బంతులలో 25 పరుగులు), రవి బొపారా (20 బంతులలో 24 పరుగులు) కూడా ఆతిథేయ జట్టు లక్ష్య సాధనకు దోహదం చేశారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 42 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్ వినయ్ కుమార్ 33 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు యువ అజింక్య రహానె తొలి అర్ధ సెంచరీ, సురేష్ రైనా వడివడిగా సాధించిన 40 పరుగులతో ఇండియా 23 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోర్ చేసి ఇంగ్లండ్‌కు గట్టి సవాల్ విసిరింది.
అంతక ముందు వర్షం కారణంగా ఒక్కొక్క ఇన్నింగ్స్‌ను 23 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాట్ చేయవలసి వచ్చిన భారత జట్టు రహానె, రైనా, రాహుల్ ద్రావిడ్, పార్థివ్ పటేల్‌ల తోడ్పాటుతో భారీ స్కోర్ చేయగలిగింది. రహానె 47 బంతులలో 54, ద్రావిడ్ 31 బంతులలో 32, పార్థివ్ పటేల్ 18 బంతులలో 28 పరుగులు చేశారు. పార్థివ్, రహానె జట్టుకు శుభారంభం చేయగా, రైనా కేవలం 19 బంతులలో 40 పరుగులు సాధించి జట్టు ఇన్నింగ్స్‌కు 'ఫినిషింగ్ టచ్" ఇచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రేమ్ స్వాన్ 33 పరుగులకు 3 వికెట్లు, టిమ్ బ్రెస్నన్ 43 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల వన్డే సీరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మూడో వన్డే లండన్‌లోని ఓవల్‌లో శుక్రవారం జరుగుతుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications