పని పూర్తికాలేదు.. ఆధిపత్యాన్ని కొనసాగిస్తాం: విరాట్ కోహ్లీ

మెల్‌బౌర్న్: మెల్‌బౌర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో సాధించిన విజయంలో విరాట్ కోహ్లీ మునిగితేలుతున్నాడు. కవ్వింపులు, వివాదాల మధ్య మూడో టెస్టు గెలిచి విజేతగా నిలిచింది కోహ్లీసేన. ఈ ఒక్క టెస్టు విజయంతో అనేక రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా.. నిర్ణయాత్మక టెస్టు కోసం ఎదురుచూస్తోంది. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న నాలుగో (చివరి) టెస్టులోనూ భారత్ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో గెలుపొందింది టీమిండియా.

సిడ్నీ టెస్టులోనూ ఇదే జోరుని కొనసాగిస్తామని
సిరీస్‌లో 2-1తో ఆధిక్యాన్ని అందుకున్న భారత్.. 399 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 258/8తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించింది. వర్షం అనంతరం బౌలర్లు రెచ్చిపోయారు. మిగిలిన రెండు వికెట్లను అవుట్ చేసి లాంచనప్రాయమైన విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 261 పరుగులకే ఆలౌటైంది. మెల్‌బోర్న్ టెస్టులో గెలుపొందిన తర్వాత మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. సిడ్నీ టెస్టులోనూ ఇదే జోరుని కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు.
భారత్ అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి
‘సిరీస్‌లో మా ఆధిపత్యాన్ని ఇక్కడితో సరిపెట్టుకోవాలనుకోవడం లేదు. ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. చివరి టెస్టు అయిన నాలుగో టెస్టులో రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీలో ఆడతాం. సిరీస్‌లో గెలిచిన రెండు టెస్టుల్లోనూ భారత్ జట్టు అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించింది. అయితే.. ఆస్ట్రేలియా గడ్డపై మేం చేయాల్సిన పని మిగిలే ఉంది. ఆఖరి టెస్టులో విజయం తప్పక సాధించాలి.

ప్లేయర్ల బ్యాటింగ్ వైఫల్యమే కొంపముంచింది
చివరి మ్యాచ్‌లో గెలిచేందుకు ఏ అవకాశం లభించినా.. వదులుకోం. కచ్చితంగా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తాం' అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్ తీరు ఇలా ఉంటే ఆసీస్ కెప్టెన్ తమ జట్టు వైఫల్యాలని ఎత్తి చూపుతూ సమావేశాన్ని ముగించాడు. మా ప్లేయర్ల బ్యాటింగ్ వైఫల్యమే కొంపముంచింది. అనుభవలేమితో బరిలోకి దిగడమే ఇలాంటి పరాభవానికి కారణమైందని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications