For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్ తరుపున అరంగేట్రంలో చెత్త రికార్డు నమోదు చేసిన థామస్‌

Oshane Thomas recorded the worst debut from West Indies

హైదరాబాద్: గువహటి వేదికగా భారత జట్టుతో జరిగిన తొలి వన్డేలో అంతర్జాతీయ అరంగేట‍్రం చేసిన వెస్టిండిస్‌ పేసర్‌ ఓషేన్‌ థామస్‌ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన తొలి వన్డేలో థామస్‌ 83 పరుగుల్ని సమర్పించుకున్నాడు.

తొమ్మిది ఓవర్లపాటు బౌలింగ్‌ వేసిన కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే తీసిన థామస్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా వెస్టిండీస్‌ తరపున అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

1
44266
చెత్త గణాంకాలను నమోదు చేసిన ఓషేన్‌ థామస్‌

చెత్త గణాంకాలను నమోదు చేసిన ఓషేన్‌ థామస్‌

అంతకముందు 2017లో నార్త్ సౌండ్ వేదికగా జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన విలియమ్స్‌ ఆ మ్యాచ్‌లో 69 పరుగులు సమర్పించుకోగా, థామస్‌ ఇప్పుడు దానిని తిరగరాసి చెత్త గణాంకాలను నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ను బౌల్డ్‌ చేసిన థామస్‌ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయాడు.

విండిస్ తరుపున అరంగేట్ర మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు:

విండిస్ తరుపున అరంగేట్ర మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు:

* Oshane Thomas - 83 against India, Guwahati, 2018

* Williamson - 69 runs against India, North Sound, 2017

* M Dhillon - 68 runs in South Africa, Lahore, 1997

* A. Joseph - 62 runs against Pakistan, Sharjah, 2016

323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే

323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే

వెస్టిండిస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే ఛేదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(4) రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ అందించిన సహకారంతో చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

సెంచరీలు మోత మోగించిన రోహిత్, కోహ్లీ

సెంచరీలు మోత మోగించిన రోహిత్, కోహ్లీ

ఒకవైపు రోహిత్‌ శర్మ కుదురుగా బ్యాటింగ్‌ చేస్తే, కోహ్లీ మాత్రం బౌండరీల మోత మోగించాడు. దీంతో భారత్‌ 10 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది. అనంతరం తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కోహ్లీ 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 36వ సెంచరీ. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ కూడా కెరీర్‌లో 20వ సెంచరీ నమోదు చేశాడు.

కోహ్లీ, రోహిత్‌లు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు

కోహ్లీ, రోహిత్‌లు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు

84 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. తద్వారా భారత్‌ తరపున గంగూలీ, టెండూల్కర్‌ల పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో కోహ్లీ140 పరుగుల వద్ద బిషూ బౌలింగ్‌లో స్టంపౌట్‌ కావడంతో రెండో వికెట్‌కు నమోదైన 246 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 322/8

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 322/8

కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (22 నాటౌట్‌) రోహిత్‌కు అండగా నిలవడంతో భారత్‌ 42.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. వెస్టిండిస్ బౌలర్లలో బిషూ, థోమస్‌లు తలో వికెట్‌ తీసుకున్నారు. అంతకుముందు టాస్ తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

Story first published: Monday, October 22, 2018, 14:03 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+