Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHని అవమానించిన మాజీ క్రికెటర్లపై మాస్ ట్రోలింగ్ (Memes)

ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ప్రపంచానికి సరికొత్త పంథా పరిచయం చేసింది. 250+ స్కోరు సాధించిడం సర్వసాధారణం అన్నట్లుగా పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలుకొట్టింది. అది హైలైట్స్‌నా, లైవ్ మ్యాచా అనే సందేహం వచ్చేలా బౌండరీలు మోతతో బ్యాటింగ్ కొనసాగించింది. భీకర బ్యాటర్లకు తోడుగా పవర్‌ఫుల్ బౌలింగ్ లైనప్‌తో వరుస విజయాలతో హోరెత్తించింది. అంతిమంగా ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.

అయితే అద్భుత ఫామ్‌ ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ను కొందరు మాజీ క్రికెటర్లు తక్కువగా అంచనా వేశారు. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేదని జోస్యం చెప్పారు. తెలుగు జట్టకు ఛాన్స్ లేదని హర్భజన్ సింగ్, హర్షా భోగ్లే వంటి ప్రముఖ్యలు వ్యాఖ్యానించారు. 'జియో సినిమా' సైతం హైదరాబాద్ టీమ్‌ను పరోక్షంగా ట్రోల్ చేసింది. కేకేఆర్, ఆర్‌ఆర్, సీఎస్కే, ఆర్సీబీ జట్లే ఫ్లేఆఫ్స్‌కు చేరుతాయని పోస్టర్ రిలీజ్ చేసింది.

Orange Army Claps Back SRH Fans Troll Former Cricketers Who Criticized the Team

కానీ విమర్శకులకు దిమ్మతిరిగే షాక్ ఇస్తూ సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఉప్పల్ వేదికగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో 15 పాయింట్లు చేరుకున్న ఎస్‌ఆర్‌‌హెచ్ తదుపరి దశకు సునాయాసంగా చేరింది. ఇక హైదరాబాద్ టీమ్ టాప్-2 స్థానంపై గురిపెట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌ను గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలవాలని భావిస్తోంది. కోల్‌కతా చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడి, పంజాబ్‌పై మన జట్టు గెలిస్తే సన్‌రైజర్స్ క్వాలిఫయిర్-1కు చేరుకోవచ్చు.

మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు చేసుకుంటుంది. జట్టును గొప్పగా నడిపిస్తున్న ప్యాట్ కమిన్స్‌ను కొనియాడుతూ పోస్ట్‌లు పెడుతుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో సారథి బాధ్యతలు అందుకున్న కమిన్స్ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. అలాగే ప్లేఆఫ్స్‌కు చేరదని జోస్యం చెప్పిన మాజీ క్రికెటర్లపై ట్రోలింగ్ చేస్తుంది. ఫన్నీ మీమ్స్‌ పోస్ట్ చేస్తోంది. ఇవి నెట్టింట వైరల్‌‌గా మారాయి.

Story first published: Friday, May 17, 2024, 8:35 [IST]
Other articles published on May 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+