Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుధవారం ఇంగ్లాండ్‌తో తొలిటెస్టు: కోహ్లీ ముంగిట సువర్ణావకాశం

Opportunity for Virat Kohli to claim No.1 spot in the Test rankings

హైదరాబాద్: సుదీర్ఘ పర్యటన నిమిత్తం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం లభించింది. ఇంతకీ ఏంటా అరుదైన రికార్డు. ఐసీసీ టెస్టు ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరుకునే అవకాశం.

ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 903 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్ పాల్పడిన ఉదంతంలో స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్

దీంతో ప్రస్తుతం స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీల మధ్య 26 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌ను అధిగమించాలంటే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది.

గత పర్యటనలో కోహ్లీ పేలవ ప్రదర్శన

గత పర్యటనలో కోహ్లీ పేలవ ప్రదర్శన

గత ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నాడు. కోహ్లీతో పాటు ఆండర్సన్ కూడా ఇదే సిరిస్ చక్కటి ప్రదర్శన చేస్తే తన టెస్టు ర్యాంకుని మెరుగుపరచుకునే అవకాశం ఉంది. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇరు జట్ల నుంచి చెరో ఐదుగురు టాప్-50లో కొనసాగుతున్నారు.

భారత్ నుంచి టాప్-50లో ఐదుగురు

భారత్ నుంచి టాప్-50లో ఐదుగురు

భారత్ నుంచి పుజారా(6), లోకేశ్ రాహుల్(18), రహానె(19), మురళీ విజయ్(23), శిఖర్ ధావన్(24)లు చోటు దక్కించుకున్నారు. ఇక, ఇంగ్లాండ్ తరఫున జో రూట్(3, కోహ్లీకి 48 పాయింట్ల దూరంలో), అలిస్టర్ కుక్(13), జానీ బెయిర్‌స్టో(16), బెన్‌స్టోక్స్(28), మొయిన్ అలీ(43) జాబితాలో ఉన్నారు.

ఆగస్టు 1న తొలి టెస్టు ఆరంభం

ఆగస్టు 1న తొలి టెస్టు ఆరంభం

బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా(3), రవిచంద్రన్ అశ్విన్(5), మహ్మద్ షమీ(17), భువనేశ్వర్ కుమార్(25), ఇషాంత్ శర్మ(26), ఉమేశ్ యాదవ్(28) ర్యాంకింగ్స్‌లో టాప్-30లో చోటు దక్కించుకున్నారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 1న ఎడ్జిబాస్టన్ వేదికగా ఆరంభంకానుంది.

Story first published: Monday, July 30, 2018, 18:37 [IST]
Other articles published on Jul 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+