మళ్లీ కొంపముంచిన కరోనా.. ఈ సారి కూడా విదేశాల్లోనే ఐపీఎల్?

కరోనా మహమ్మారి మరోసారి కొంప ముంచేలా ఉంది. అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ కరోనా కారణంగా ఈ సారి కూడా విదేశాలకు తరలిపోయేలా ఉంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఏప్రిల్‌లో ఐపీఎల్ 2022 జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
దీనికి తోడు ఒమిక్రాన్ కూడా క్రమంగా వ్యాప్తి చెందుతుంది. నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరిలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృత స్థాయికి చేరుకుంటుంది. ఈ లెక్కన ఐపీఎల్ జరిగే ఏప్రిల్, మే నెలల్లో ప్రతి రోజూ లక్షల్లో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

భారత్‌కే తొలి ప్రాధాన్యం
దీంతో ఈ సారి కూడా ఐపీఎల్‌ను బీసీసీఐ విదేశాల్లోనే నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఐపీఎల్ నిర్వహణల్లో తొలి ప్రాధాన్యం మాత్రమే భారత్‌కే ఇస్తున్నట్టు తెలిసింది. భారత్‌లో ఐపీఎల్ నిర్వహించే అన్ని అవకాశాలను బీసీసీఐ అన్వేషిస్తోందని సమాచారం. అవసరమైతే ఒకే వేదికలో టోర్నీ నిర్వహించాలని భావిస్తోందట. లేదా ప్రేక్షకులు లేకుండా అయినా సరే నిర్వహించాలని అనుకుంటుందట. ఇవేవి కుదరకపోతేనే విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది.

ముందుగా వేలం నిర్వహణ
అయితే దీనికంటే ముందు ఐపీఎల్ మెగా వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ అధికారులు అనుకుంటున్నట్లు సమాచారం. నిజానికి డిసెంబర్‌లోనే మెగా వేలం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వేలం వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది.

వేసవిలో ఐపీఎల్
ఇప్పటి వరకు ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించికపోయినా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా వేసవిలో ఈ టోర్నమెంట్ జరగనుంది. వేదికలను కూడా బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిబంధనలు తీసుకువస్తాయనే దానిపై వేదికల ఖరారు నిర్ణయం ఆధారపడి ఉంది. ఒక వేళ విదేశాల్లో నిర్వహించాల్సి వస్తే గతంలో మాదిరిగా యూఏఈలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గత సీజన్లు విదేశాల్లోనే
కరోనా కారణంగా 2020 ఐపీఎల్ సీజన్‌ను బీసీసీ పూర్తిగా యూఏఈలోనే నిర్వహించింది. అలాగే 2021 ఐపీఎల్ సీజన్ భారత్‌లో సగం ముగిశాక కరోనా విజృంభించడంతో మిగతా సీజన్‌ను యూఏఈలోనే నిర్వహించింది. కాగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే రంజీ ట్రోఫీతోపాటు ఇతర స్థానిక టోర్నిలన్నింటినీ బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications