ఇక నుంచి బౌండరీ సిక్స్ కాదట, కొత్త ఫీచర్స్‌తో OPPO F7

హైదరాబాద్: కొన్నాళ్ల పాటు సెల్‌ఫోన్ రంగంలో రారాజులా వెలిగిన ఫోన్లన్నింటినీ పక్కకు నెట్టి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మొబైల్ ఒప్పో. ఇది వచ్చిన కొంతకాలంలోనే అదే కేవలం సెల్ఫీ నేపథ్యంగా సెల్ఫీ ఎక్సపర్ట్ అంటూ వచ్చి మార్కెట్‌లో తుఫాన్‌లా చెలరేగింది. అంతేకాదు ప్రచారంలోనూ టాప్‌లోనే నిల్చొంది. క్రికెట్ ఈవెంట్‌లలో, రిటైల్ ఏజెంట్ల వద్ద ప్లెక్సీలతో భారీ స్థాయిలో ప్రచారంలోనూ తనదే పైచేయిగా నిలిచిన ఈ మొబైల్ అమ్మకాలలోనూ అదే జోరును కొనసాగించింది.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న రోజుల్లో సెల్ఫీ ఎక్స్‌పెర్ట్ రూపొందించి.. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో HD క్వాలిటీ ఫొటోలతో OPPO ఫోన్‌లో తీశామని చెప్పకునేంత స్థాయిలో తనదైన గుణాన్ని చాటుతోంది. ఇంకా, రోజురోజుకూ అప్‌డేటెడ్ టెక్నాలజీని వినియోగదార్ల ముందుంచేందుకు OPPO తాపత్రయపడుతోంది.

OPPO F5 కొనసాగింపుగా OPPO F7:
ఈ నేపథ్యంలోనే మార్కెట్ లోకి మరో కొత్త మోడల్‌తో అడుగుపెట్టింది. గతేడాది వరకూ ఉన్న OPPO F5 మోడల్‌ను కొనసాగింపుగా విడుదల చేయబోతున్న మొబైల్ OPPO F7. వినియోగదారుల అంచనాలకు మించిన ఫీచర్లతో మార్చి 26వ తేదీ ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది.

ఫోన్ అంతా స్క్రీన్
కేవలం ఈ ఫోన్ బాడీలో 89.09శాతం స్క్రీన్‌యే ఉండేలా రూపొందించబడింది. అంటే కేవలం అంచులు మినహాయించి ఫోన్ అంతా స్క్రీన్ ఉంటుందన్నమాట. ఇక HD క్వాలిటీ వచ్చేసరికి (1080x2280 pixels)తో అత్యున్నతమైన స్క్రీన్ క్వాలిటీ 6.23 అంగుళాల సైజులో ఉండనుంది. వాడేందుకు సులభంగా ఉండాలని ఫీచర్లను మరింత సవివరంగా ప్రతి కేటగిరీ విడివిడిగా విభజించబడింది. ఫొటోగ్రఫీ, గేమింగ్, వీడియోలు, ఇంటర్నెట్ వాడకం ఇలాంటి సదుపాయాలతో కనిపించే స్క్రీన్ 2.0 ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.

25 మెగా పిక్సెల్‌తో సెల్ఫీ
మైండ్ బ్లోయింగ్ క్వాలిటీతో సెల్ఫీ కోసం కేవలం ఫ్రంట్ కెమెరా 25 మెగా పిక్సెల్‌తో రూపొందించారు. సరికొత్త రంగుల్లో విడుదల కాబోతున్న F7 కలర్ ఆపరేటింగ్ సిస్టమ్ 5.0తో యాండ్రాయిడ్ 8.1తో మార్కెట్‌లోకి రానుంది. ఫేస్ లాక్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న ఫోన్ తెరను 0.08సెకన్లలోనే అన్ లాక్ చేస్తుంది. అందుబాటులోకి రానున్న రంగులు సోలార్ రెడ్, మూన్ లైట్ సిల్వర్, బ్లాక్.

పోటీని కూడా నిర్వహించి
ఇదే ఫోన్ ప్రమోషన్ చేసేందుకు గాను సోషల్ మీడియా వేదికగా OPPO ఫోన్ వెనుక ఉన్నదెవరూ అంటూ ఓ పోటీని కూడా నిర్వహించింది. తర్వాత ఆ మిస్టరీ ఇండియన్ క్రికెటర్ వీళ్లేనంటూ హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌ల పేర్లు తెరమీదికి తీసుకొచ్చింది. గత ఐదేళ్లుగా OPPO సంస్థ బీసీసీఐతో భాగస్వామిగా కొనసాగుతోంది. ఇదే నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జెర్సీలపై OPPO కంపెనీ లోగోను ధరిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications