Operation Sindoor: భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నారు. ఆ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఈ దాడులు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత జట్టు మాజీ ఓపెనింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన ట్వీట్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత భారత బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. 'ధర్మో రక్షతి రక్షితః, జై హింద్ కీ సేన' అంటూ సెహ్వాగ్ రెండు లైన్ల ట్వీట్ లో రాశాడు. సెహ్వాగ్ ట్వీట్‌ను భారత ప్రజలు చాలా లైక్ చేస్తున్నారు. కొంతమంది సెహ్వాగ్ ట్వీట్ పై స్పందిస్తున్నారు. పహల్గామ్ దాడికి భారత సైన్యం పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుంచి దేశంలో ఆనంద వాతావరణం నెలకొంది.

పహల్గామ్ దాడిపై ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం బుధవారం భారీ చర్య చేపట్టింది. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆపరేషన్‌లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నారు. ఆ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఆపరేషన్ 'సిందూర్' అని పేరు పెట్టబడిన ఈ ఆపరేషన్, జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్), లష్కరే-తోయిబా (ఎల్‌ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు చెందిన తొమ్మిది రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
ఉగ్ర స్థావరాలపై దాడి
అధికారుల ప్రకారం.. జైష్-ఎ-మహమ్మద్ బలమైన ప్రాంతాలైన బహవల్పూర్, మురిడ్కేలలో అతిపెద్ద ఆపరేషన్లు జరిగాయి. ఇక్కడ 25-30 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారని అంచనా. లష్కరే-తోయిబా ప్రధాన కేంద్రం, ప్రధాన కార్యాలయం, మురిడ్కేలోని మసీదు వా మర్కజ్ తైబాను లక్ష్యంగా చేసుకున్నారు. దీనిని పాకిస్థాన్ లో ఉగ్రవాదానికి 'నర్సరీ'గా పరిగణిస్తారు. ఇతర ప్రదేశాలలో జరిగిన నష్టాన్ని నిఘా సంస్థలు ఇంకా అంచనా వేస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారు. లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాలలో లాంచ్ ప్యాడ్‌లు, శిక్షణా శిబిరాలు, జైష్-ఎ-మహమ్మద్ శిబిరాలు, రాడికలైజేషన్ కేంద్రాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి జేఈఎం, ఎల్ఈటి రెండింటినీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.