Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. పీఎస్ఎల్‌కు షాకిచ్చిన విదేశీ ఆటగాళ్లు!
Operation Sindoor: మే 7న భారత సైన్యం పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దీని కారణంగా పాకిస్థాన్‌లో నివసిస్తున్న 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ఈ దాడులు చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ప్రభావం పాకిస్థాన్ సూపర్ లీగ్ అంటే పీఎస్ఎల్‌పై కూడా పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) క్రికెట్ సిరీస్ నుంచి ఇద్దరు ఇంగ్లీష్ ఆటగాళ్లు వైదొలగాలను నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో వారు తన జట్టు మేనేజ్‌మెంట్‌ను సంప్రదించారు.
వారితో పాటు మరో 5గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో మొత్తం 7 మంది ఇంగ్లీష్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పీఎస్ఎల్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్‌లో భాగమైన ఇంగ్లాండ్ ఆటగాళ్లు డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్ భద్రతా కారణాలు, కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా తమ దేశానికి తిరిగి వెళ్లాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇతర ఆటగాళ్లు కూడా దీనిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB), ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్(PCA) తమ దేశ ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ విషయంలో సలహాలు అందిస్తున్నట్లు తెలిసింది. రెండు సంస్థలు కూడా ఇంగ్లీష్ ఆటగాళ్ల ఉపసంహరణపై అధికారికంగా ఏ విషయాన్ని ప్రకటించలేదు. అయితే ప్రస్తుతానికి ఇద్దరు ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి నిష్క్రమించాలనే కోరికను వ్యక్తం చేశారు. మిగిలిన ఐదుగురు ఆటగాళ్లను పాకిస్థాన్‌లోని ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఏజెంట్ శాంతింపజేసినట్లు చెబుతున్నారు.
'ఆపరేషన్ సిందూర్'లో మొదటి రెండు రోజులు పాకిస్థాన్‌లో విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ ఆటగాళ్లు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు పాకిస్థాన్ నుంచి అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆటగాళ్లు ప్రశాంతంగా ఉన్నారని, ఆటను కొనసాగిస్తారని ఏజెంట్ చెప్పాడు. రాబోయే 24 గంటల్లో మరో దాడి జరిగితే ఇంగ్లీష్ ఆటగాళ్లను మాత్రమే కాకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొన్న ఇతర విదేశీ ఆటగాళ్లను కూడా వదిలి వెళ్లమని సూచించే అవకాశం కూడా ఉంది.
అదే సమయంలో భారత్‌లో కూడా ఐపీఎల్ సిరీస్ జరుగుతోంది. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌లను మాత్రమే తరలించారు. లేకపోతే విదేశీ ఆటగాళ్లందరూ సురక్షితంగా ఉన్నారు. భారత ప్రభుత్వ సలహా మేరకు ఐపీఎల్ సిరీస్ కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications