అయ్యో.. పంత్ రనౌట్, ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ, 12 ఓవర్లకు 110 పరుగులు
కాన్పుర్: గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ కు వింత అనుభవం ఎదురైంది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ప్రదీప్ సంగ్వన్ శాంసన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చిరావడంతోనే ఫోర్ కొట్టాడు. మరుసటి బంతిని ఆడబోయిన రిషబ్ వింతగా రనౌటై అందరినీ ఆశ్చర్యపర్చాడు.

లెగ్ సైడ్ ఆడబోయిన పంత్ బంతి ప్యాడ్ కు తగలడంతో సంగ్వన్ అప్పీల్ చేశాడు. వేంటనే బంతిని అందుకున్న సురేశ్ రైనా వికెట్ల వైపు విసరడంతో నేరుగా తగిలింది. పంత్ క్రీజులో లేక పోవడంతో రనౌట్ గా వెనుదిరిగాల్సి వచ్చింది.
ఇది కనురెప్పపాటులో జరగడంతో స్టేడియం అంతా హతాశులయ్యారు. అంపైర్ దర్ఢ్ ఎంపైర్ కి నివేదించినా రిషబ్ క్రీజు నుంచి వెనుదిరిగాడు. రిషబ్ గుజరాత్ తో జరిగిన గత మ్యాచ్ లో సునామి ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించిన విషయం తెలిసిందే.
12 ఓవర్లకు 110 పరుగులు...
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ డేర్ డెవిల్స్ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (57), బ్రాత్‌వైట్ (1) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications