జియో ఫిల్మ్ ఫేర్ అవార్డులు: ఇర్ఫాన్ ఖాన్‌కు బదులుగా ఇర్ఫాన్ పఠాన్

హైదరాబాద్: జియో ఫిల్మ్ ఫేర్ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ జాబితాను ప్రముఖ మ్యాగజైన్ చేసిన తప్పిదం వల్ల ఇర్ఫాన్ ఖాన్‌కు బదులుగా ఇర్ఫాన్ పఠాన్ పేరు ప్రచురితమైంది. ఈ పొరపాటుకు ఇర్పాన్ పఠాన్ సానుకూలంగా స్పందించాడు.
'ధన్యవాదాలు. నేను అవార్డు అందుకోవడానికి రాలేను. నా అవార్డును ఇంటికి పంపించండి' అని పేర్కొన్నాడు. పఠాన్ ట్వీట్‌కు నెటిజన్లు కూడా సరదాగా స్పందించారు. ఇర్ఫాన్ జీ 'మీరు చేసిన ట్వీట్‌కు మీకు నిజంగానే అవార్డు వస్తుంది' అని పేర్కొన్నారు.
హిందీ మీడియం సినిమాలో నటనకుగాను ఇర్ఫాన్ ఖాన్‌కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ 'ఫెమినా' తన ట్విటర్‌లో ఇర్ఫాన్ ఖాన్ పేరుకు బదులు ఇర్ఫాన్ పఠాన్ అని పేర్కొంది. దీనికి పఠాన్ సరదాగా స్పందించాడు.
ప్రస్తుతం జరుగుతోన్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇర్ఫాన్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications