Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుల్దీప్‌ను ఎందుకు తప్పిస్తున్నారు: వీవీఎస్ లక్ష్మణ్

Onus On Wrist Spinners VVS Laxman
Onus on wrist spinners: VVS Laxman

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్.. తొలి సిరీస్‌లో విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ తర్వాత జరగనున్న వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం కష్టంగానే భావిస్తోంది. దీనికోసం జట్టు కూర్పులో తర్జనభర్జనలు పడుతోంది. తొలి టీ20లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్‌ను జట్టుకు దూరంగా ఉంచాలని భావిస్తోంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు.

ఇంగ్లాండ్ గడ్డపై తొలి టీ20లో అత్యుత్తమ ప్రదర్శనని కనబర్చాడు కుల్దీప్ యాదవ్‌. తానొక్కడే 5వికెట్లను తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి టీ20లో అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మెర్లీన్ మెషీన్‌తో కుల్దీప్ శైలిలోనే వచ్చే బంతులతో ప్రాక్టీస్ చేశారు. ఆ దెబ్బకి రెండో టీ20లో విజయం చేజారగా.. మూడో టీ20లో తుది జట్టు నుంచి తప్పించడాన్ని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తప్పుబట్టాడు.

గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ మొదలవనుండగా.. కనీసం ఈ సిరీస్‌లోనైనా తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌‌‌ను కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కి సూచించాడు. 'మూడో టీ20లో కుల్దీప్‌ యాదవ్‌‌కి తుది జట్టులో చోటివ్వకపోవడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. భారత జట్టుని అతను ఒంటిచేత్తో గెలిపించిన తర్వాత.. మ్యాచ్ వ్యవధిలోనే అతడ్ని పక్కన పెట్టడమా..? కనీసం.. వన్డే సిరీస్‌లోనైనా అతడ్ని తుది జట్టులో కొనసాగిస్తే మేలు. కుల్దీప్ యాదవ్‌తో పాటు.. చాహల్‌ కూడా వన్డే సిరీస్‌లో చాలా కీలకంకానున్నారు. సిరీస్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్ జట్టు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నా.. భారత బౌలర్లు పుంజుకుంటున్న తీరు అమోఘం' అని వీవీఎస్‌ లక్ష్మణ్ ప్రశంసించాడు.

మాంచెస్టర్ వేదికగా ఈనెల 3న జరిగిన తొలి టీ20లో 5/24తో కెరీర్‌లో బెస్ట్ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ యాదవ్.. భారత జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అయితే.. 6న జరిగిన రెండో టీ20లో మాత్రం అతను 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో.. గత ఆదివారం జరిగిన మూడో టీ20లో అతనిపై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌ని ఎంచుకుంది.

Story first published: Tuesday, July 17, 2018, 16:29 [IST]
Other articles published on Jul 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+