
15వేల పరుగుల మైలురాయి:
ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 227 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించగా.. సచిన్ బ్యాట్‌తో అదరగొట్టారు. 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 బంతుల్లో 93 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే 15వేల పరుగుల మైలురాయిని అధిగమించారు. ఇక 32వ ఓవర్‌లో ఆరో వికెట్‌గా సచిన్ వెనుదిరిగారు. చివరలో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తిక్ పనిపూర్తి చేసి జట్టును విజయ తీరానికి చేర్చారు. భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 1989 నవంబర్ 15న సచిన్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడారు. అదే ఏడాది డిసెంబర్ 18న తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడారు.

కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు:
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు చేశారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించారు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశారు.

క్రికెట్ చరిత్రలో వంద శతకాలు:
2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచారు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

కెప్టెన్సీ లోటు మాత్రమే:
సచిన్ టెండూల్కర్ విజయవంతమైన కెరీర్‌లో ఏదైనా లోటు ఉందంటే అది కెప్టెన్సీ ఒక్కటే. 1996 ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక మ్యాచ్ గల బోర్డర్ గావస్కర్ సిరీస్‌తో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సచిన్.. 73 వన్డేలు, 25 టెస్టుల్లో జట్టును నడిపించారు. కానీ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలన్నందించలేకపోయారు. అతని సారథ్యంలో భారత్ 23 వన్డేలు, 4 టెస్ట్‌లు మాత్రమే గెలవడం గమనార్హం. వ్యక్తిగతంగా రాణించినా.. జట్టును నడిపించడంలో మాత్రం లిటిల్ మాస్టర్ విఫలమయ్యారు.
'నాయకత్వానికి అసలైన నిర్వచనం కోహ్లీ.. అతడి కెప్టెన్సీలో ఆడివుంటే ఎంతో బాగుండు'


Click it and Unblock the Notifications












