సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున: ధోనిసేన ఛాంపియన్స్ ట్రోఫి నెగ్గిన వేళ


హైదరాబాద్: సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఈరోజుతో ఆ మధుర క్షణాలకు ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఐసీసీ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. 2013లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇంగ్లాండ్, వేల్స్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి.
ఐదు పరుగుల తేడాతో భారత్ విజయం
ఈ టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై ధోని నేతృత్వంలోని టీమిండియా ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీని ఆ ఒక్కసారి మాత్రమే టీ20 ఫార్మట్‌లో నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ విజయానికి 20 బంతుల్లో 22 పరుగులు
అనంతరం 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. ఒకానొక సమయం ఈ లక్షాన్ని చేధించేలా కనిపించింది. చివర్లో ఇంగ్లాండ్ విజయానికి 20 బంతుల్లో 22 పరుగులు చేయాలి, చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందని అంతా భావించారు.

వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు
ఇలాంటి సమయంలో ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. చివర్లో ధోని, బౌలర్ల కట్టదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడికి గురైన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలచుకుంది.

రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవటం ఇది రెండో సారి. 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications