
హైదరాబాద్: అస్ట్రేలియా జట్టు మాజీ వైస్ కెప్టెన్ షేన్ వాట్సన్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ జాన్ సెనాకు క్రికెట్ ఆడటం ఎలాగో నేర్పించారు. త్వరలో విడుదల కాబోతున్న తన చిత్రం 'ఫెర్డినాండ్' ప్రమోషన్ కోసం జాన్ సెనా ఆస్ట్రేలియాకు వచ్చారు.
ఈ సందర్భంగా జాన్ సెనాకు వాట్సన్ కొన్ని క్రికెట్ మెళకువలు నేర్పించారు. వీరిద్దరూ కలిసి క్రికెట్ ఆడుతున్న ఫోటోని షేన్ వాట్సన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 'జాన్ సెనాతో ఓ అద్భుతమైన రోజు ఇది. ఈ ఛాంపియన్‌కి కేవలం ఉత్తమమైన బ్యాట్స్ మాత్రమే' అని ఆ ఫోటోకి కామెంట్ పెట్టారు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు షేన్ వాట్సన్ వీడ్కోలు పలికిన తర్వాత ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో వాట్సన్ సిడ్నీ థండర్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దీంతో వీరిద్దరూ ఆ జట్ట డ్రెస్ ధరించి అక్కడి చిన్నారుతలో కాసేపు సరదాగా ముచ్చటించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక, జాన్ సెనా విషయానికి వస్తే డబ్ల్యూడబ్ల్యూఈ టోర్నీలో 16 సార్లు ఛాంపియన్‌గా నిలిచారు.