'సర్దార్ జీ'కి మాత్రమే తెలుసు: మంకీగేట్ వివాదంపై గంగూలీ
హైదరాబాద్: 2007-08లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్టు సిరిస్‌లో చోటు చేసుకున్న 'మంకీగేట్' వివాదం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో టెస్టులో తనను ఉద్దేశించి భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ 'మంకీ' (కోతి) అన్నాడని, ఇవి జాతివిద్వేషపూరితమైన వ్యాఖ్యలని ఆసీస్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ సిమండ్స్ అప్పట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం అప్పట్లో పెను చర్చనీయాంశం అవడంతో పాటు ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపేలా చేసింది. అయితే చివరకు ఐసీసీ రంగంలోకి దిగి భజ్జీపై విచారణ జరిపి ఒక టెస్టు మ్యాచ్ నిషేధం విధించడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పుడు ఈ వివాదం ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా?

క్లార్క్ బయోగ్రఫీ 'మై స్టోరీ' పుస్తకాన్ని విడుదల చేసిన గంగూలీ
ఈ మంకీగేట్ వివాదానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ క్లార్ తాజాగా స్పందించారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ బయోగ్రఫీ 'మై స్టోరీ' పుస్తకాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కోల్‌కతాలో మంగళవారం విడుదల చేశారు.

మంకీగేట్‌పై సౌరభ్ గంగూలీ
ఈ సందర్భంగా 'మంకీగేట్' వివాదాన్ని సరదాగా గంగూలీ ప్రస్తావించారు. 'కొన్నిసార్లు అసలైన నిజమేమిటో ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పుస్తకంలో 'మంకీగేట్' అధ్యాయం గురించి పూర్తి వాస్తవాలు మీకు లభించకపోవచ్చు' అని పేర్కొన్నారు. ఇంతకూ సిమండ్స్‌ను భజ్జీ 'మంకీ' అన్నాడా? లేక ఇంకా ఏదైనా తిట్టాడా? అన్నది ఇప్పటికీ మిస్టరీనే.

హర్భజన్ ఏమన్నాడో 'ఓ సర్దార్జీ'కి మాత్రమే తెలుసు
దీనిపై స్పందిస్తూ అప్పుడు హర్భజన్ ఏం అనాలనుకున్నాడో కేవలం 'ఓ సర్దార్జీ'కి మాత్రమే తెలుసునని గంగూలీ చమత్కరించారు. ఈ వివాదాన్ని మీరు 'మంకీగేట్' లేదా, 'హనుమాన్ గేట్' అని ఎలాగైనా పిలుచుకోవచ్చునని సలహా ఇచ్చారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ 2007-08లో సిడ్నీలో ఇరుజట్ల మధ్య జరిగిన సిరీస్‌లో వివాదాస్పదమైన మంకీగేట్ ఉదంతాన్ని సాగదీయాల్సింది కాదని అన్నాడు.

డీఆర్‌ఎస్ వివాదంపై ఇరు దేశాల బోర్డులు బాగా పనిచేశాయి
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న డీఆర్‌ఎస్ వివాదాన్ని ఇరు దేశాల బోర్డులు త్వరగా ముగించి మంచి పని చేశాయని క్లార్క్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నెలకొన్న డీఆర్‌ఎస్ వివాదానికి ముగింపు పలుకడంలో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా చాలా చక్కగా వ్యవహరించారని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications